దేశం మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేసిన రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు ఘటనకు కారణమైన అనుమానితుడి ఫోటోను బెంగళూరు పోలీసులు రిలీజ్ చేశారు. రామేశ్వరం కేఫ్ కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించిన పోలీసులు ఒక వ్యక్తి ముఖానికి బ్యాగ్ తో ముఖానికి మాస్క్, తలకి క్యాప్ పెట్టుకొని కేఫ్ ప్రవేశిస్తున్న విజువల్స్ ని పోలీసులు రిలీజ్ చేశారు. సదరు వ్యక్తి ఇడ్లి ప్లేట్ తో కేఫ్ లోకి ప్రవేశిస్తున్నట్లు గుర్తించారు.
పేలుడు కారణమైన బ్యాగ్ ను వదిలేసి వెళ్ళింది ఈ వ్యక్తే అని పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు ఘటన జరిగిన 24గంటలోపే అనుమానితుడిని గుర్తించటంతో బెంగళూరు పోలీసులను పొగుడుతూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. ఘటన జరిగిన కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న లోకల్ పోలీసులు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లు విచారణ ముమ్మరం చేశారు.
ఈ ఘటనలో గాయపడ్డ 10మంది కస్టమర్లు, స్టాఫ్ పసుతం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ ఘటనపై స్పందించిన కమిషనర్ కేసు విచారణ ముమ్మరంగా జరుగుతోందని, వివిధ కోణాల్లో ఇవెస్టిగేటివ్ టీమ్స్ దర్యాప్తు చేస్తున్నాయని, కేసు యొక్క తీవ్రత, భద్రతా అంశాలను దృష్టిలో ఉంచుకొని మీడియా సపోర్ట్ చేయాలని కోరారు.
