ఒకరు మాటల్లో పెడతారు.. మరొకరు బ్లేడుతో కవర్లు కత్తిరించి డబ్బు కొట్టేస్తారు.. నకిరేకల్ బ్యాంకు చోరీ వివరాలు

ఒకరు మాటల్లో పెడతారు.. మరొకరు బ్లేడుతో కవర్లు కత్తిరించి డబ్బు కొట్టేస్తారు.. నకిరేకల్ బ్యాంకు చోరీ వివరాలు

ఒకే కుటుంబం.. ఏడు మంది సభ్యులు.. అందులో ఇద్దరు మైనర్లు. ఫ్యామిలీ అంతా కలిసి దొంగతనానికి దిగటం వీళ్ల స్పెషల్. ఒకరు మాటల్లో పెడితే.. మరొకరు చేతిలో ఉన్న కవర్లు కట్ చేసి నగలు కొట్టేస్తారు. ఇంకొకరు వాటిని తీసుకుని బయటకు జారుకుంటారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ కోఆపరేటివ్ బ్యాంకు చోరీకి సంబంధించి పోలీసులు చెప్పిన వివరాలు చూస్తే ఆశ్చర్యం వేయకమానదు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం (ఆగస్టు 29) వెల్లడించారు పోలీసులు. కోఆపరేటివ్ బ్యాంకులో మూడు లక్షల రూపాయలు చోరీ చేసిన దొంగలను అరెస్ట్ చేశారు పోలీసులు. మాదా నాగరాజు అనే వ్యక్తి వద్ద ఏడుగురూ కలిసి  డబ్బులు దొంగతనం చేశారు. నిందితులు ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి గూడానికి చెందిన ఒకే కుటుంబం గా చెప్పారు పోలీసులు. 

వీళ్లు బ్యాంకులో చొరబడి డబ్బులు ఉన్న వ్యక్తిని మాటల్లో పెట్టి  దొంగతన చేయడం అలవాటు గా పెట్టుకున్నారు. అయితే బ్యాంకులో నాగరాజు చేతిలో ఉన్న కవర్ ను మహిళలు బ్లేడుతో కోసి కవర్లో ఉన్న 2 లక్షల 50 వేల రూపాయలను ఎత్తుకెళ్లారు . 

 దొంగతనం చేసిన తర్వాత తమ సొంత వాహనంలో విజయవాడకు వెళ్లారు. అక్కడ అమ్మవారి దేవాలయంలో నిద్ర చేసి తిరిగి మరో దొంగతనం చేయడం కోసం వచ్చారు. చిట్యాల నార్కట్ పల్లి చౌటుప్పల్ బ్యాంకులలో చోరీ చేయడానికి తిరిగి వచ్చిన వీరిని అరెస్టు చేశారు పోలీసులు. అప్పటికే నిఘా పెట్టిన పోలీసులు నకిరేకల్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు.  నిందితుల నుంచి 2 లక్షల 35 వేలు  స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు.