రూ.17 లక్షల హవాలా డబ్బు సీజ్.. ఇద్దరి అరెస్ట్

రూ.17 లక్షల హవాలా డబ్బు సీజ్.. ఇద్దరి అరెస్ట్

హైదరాబాద్ లో భారీగా హవాలా డబ్బును సీజ్ చేశారు కాచిగూడ పోలీసులు. విశ్వసనీయ సమాచారం మేరకు కాచిగూడ రైల్వే స్టేషన్ రోడ్ లో వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు..ఓ వ్యక్తి వద్ద రూ. 17 లక్షల హవాలా డబ్బును గుర్తించారు. నగరంలోని బడిచౌడి ప్రాంతానికి చెందిన హరి నారాయణ కొట్టారి అనే వ్యక్తి రూ. 17 లక్షల అక్రమ నగదు కాటేదాన్ ప్రాంతానికి చెందిన షోహెల్ అనే వ్యక్తుల మధ్య చేతులు మారుతుండగా గుర్తించిన పోలీసులు రెడ్ హ్యానడెడ్ గా పట్టుకున్నారు. 

పోలీసులు నగదును సీజ్ చేసి ఐటీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని.. ఈ డబ్బు ఎవరికి చెందినదని.. దీని వెనుకాల ఎవరు ఉన్నారని ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి నిందితులను కాచీగూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు.