కడపలో రూ.3 కోట్ల విలువైన బంగారం సీజ్

కడపలో రూ.3 కోట్ల విలువైన బంగారం సీజ్

కడప జిల్లాల్లో పోలీసుల తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది.  నెల్లూరు నుంచి కడపకు వస్తున్న కారును  కడప నగరంలోని గౌస్ నగర్ వద్ద అర్థరాత్రి పోలీసులు తనిఖీ చేయగా కారుకు ఎలాంటి రికార్డులు లేవు, దీంతో అనుమానం వచ్చిన పోలీసులు పోలీస్టేషన్ కు తరలించారు. వాహనాన్ని ముమ్మరంగా తనిఖీ చేయగా కారులోని సీటు వెనకాల ఉన్న లాకర్లో బంగారం పట్టుబడింది. బంగారానికి ఎలాంటి డాక్యుమెంట్స్ లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరులోని మౌనిక జ్యూవెలర్స్ కు చెందిన ముగ్గురు  అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారుతో పాటు  రూ. 3 కోట్ల విలువైన 6.930 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారాన్ని ఐటీ,ఈడీ అధికారులకు అప్పగించనున్నట్లు కడప డీఎస్పీ  సూర్యనారాయణ తెలిపారు.