జగ్గయ్యపేట దగ్గర ఉద్రిక్తత..పవన్ ను అడ్డుకున్నపోలీసులు

జగ్గయ్యపేట దగ్గర ఉద్రిక్తత..పవన్ ను అడ్డుకున్నపోలీసులు

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.  ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లేందుకు ప్రయత్నించిన పవన్ కళ్యాణ్  కు ఎయిర్ పోర్టు అధికారులు అనుమతించకపోవడంతో ఆయన రోడ్డు మార్గంలో బయల్దేరారు. అయితే అనుమతి లేదని పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ను జగ్గయ్యపేట దగ్గర్లో గరికపాడు చెక్ పోస్టు దగ్గర పోలీసులు అడ్డుకున్నారు.

అప్పటికే అక్కడికి  భారీగా చేరుకున్న జనసైనికులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. జనసేన కార్యకర్తలకు , పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. బారికేడ్లను తొలగించారు జనసైనికులు. దీంతో పోలీసు వారిపై లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.

నాలుగు గంటలుగా కొనసాగుతోన్న  విచారణ

టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు 4 గంటలుగా సిట్‌ కార్యాలయంలోనే ఉన్నారు. ఇవాళ రాత్రంతా సీఐడీ ఆఫీసులోనే చంద్రబాబును ఉంచనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 10వ తేదీ ఉదయం 5 గంటల తర్వాత ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టే ఆలోచనలో సీఐడీ అధికారులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. అప్పటి వరకూ సమయం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ లోగా స్కామ్ కు సంబంధించిన ప్రశ్నలతో చంద్రబాబును ఎంక్వైరీ చేస్తున్నారు. స్కామ్ పై 20 కీలక ప్రశ్నలను సంధిస్తున్నారు సీఐడీ అధికారులు. సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం 6 గంటలకు చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు చూపించారు. 

నంద్యాల నుంచి రోడ్డు మార్గంలో సెప్టెంబర్ 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు కుంచనపల్లిలోని సిట్‌ కార్యాలయానికి చంద్రబాబును తీసుకొచ్చారు. న్యాయ సహాయం కోసం తమ లాయర్లను కలిసేందుకు అనుమతివ్వాలని సీఐడీ అధికారులు చంద్రబాబు లేఖ రాశారు.