నాంపల్లి కోర్టుకు డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్

నాంపల్లి కోర్టుకు డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్

రాడిసన్ హోటల్లోని ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టును పోలీసులు నాంపల్లి కోర్టుకు సమర్పించారు. ఈజీ మనీ కోసం పబ్ నిర్వాహకుడు అభిషేక్, మేనేజర్ అనిల్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్లో తెల్లవారు జామున 4గంటల వరకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందిందని, దీంతో అర్థరాత్రి 2గంటల సమయంలో రైడ్ చేసినట్లు పోలీసులు రిపోర్టులో స్పష్టం చేశారు. పబ్లోని ఓ ట్రేలో తెల్లని పౌడర్ను గమనించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ పౌడర్ను పరీక్షించగా కొకైన్గా తేలింది. పబ్లో వేరు వేరు చోట్ల మొత్తం 5 ప్యాకెట్లలో 4.64 గ్రాముల కొకైన్ రికవర్ చేసి నిందితులపై 1985 ఎన్డీపీఎస్ యాక్ట్ u/s 42(2) కింద కేస్ నమోదు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. 

మరిన్ని వార్తల కోసం..

భారత్లో ప్రవేశించిన కరోనా కొత్త వేరియెంట్

కేసీఆర్ సంత‌కం రైతులకు మరణశాసనమైంది