Good News : పాస్ పోర్టు జారీలో పోలీస్ వెరిఫికేషన్ టైం తగ్గింపు

Good News : పాస్ పోర్టు జారీలో పోలీస్ వెరిఫికేషన్ టైం తగ్గింపు

న్యూఢిల్లీ : పాస్పోర్టుల జారీలో పోలీస్ వెరిఫికేషన్ సమయాన్ని తగ్గించేందుకు విదేశాంగ శాఖ కృషి చేస్తోందని ఆ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పోలీసులు తనిఖీ చేస్తారు. దీని తరువాతే పాస్పోర్టులను జారీ చేస్తున్నారు. ఈ ప్రక్రియను మరింత సరళీకరించాలని భావిస్తున్నట్లు పాస్పోర్టు దివస్ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తెలిపారు. 

పాస్పోర్టులు దేశ అంతర్జాతీయ వ్యాపార రంగం అభివృద్ధిలో, గ్లోబల్ మొబిలిటీని పెంచడంలో కీలక పాత్రపోషిస్తాయని చెప్పారు. పాస్పోర్టులను మరింత త్వరితగతిన అందించేందుకు ఇప్పటికే 440 పోస్టాఫీస్ లోనూ పాస్పోర్టు సేవా కేంద్రాలను ప్రారంభించిన ట్లు చెప్పారు. దేశంలో పాస్పోర్టు సేవా కేంద్రాలు 93 ఉన్నాయి. 533 పాస్పోర్టు ప్రాసెసింగ్ సెంటర్లు, 37 రీజనల్ పాస్పోర్టు కార్యాలయాలు పనిచేస్తున్నాయి. 

విదేశాల్లో భారత పాస్పోర్టుల జారీ చేసేందుకు 187 కేంద్రాలు పని చేస్తున్నాయి. పాస్పోర్టులను మరింత వేగంగా జారీ చేసేందుకు పోలీస్ వెరిఫికేషన్ సమయాన్ని మరింత తగ్గించేందుక 2) విదేశాంగ శాఖ రాష్ట్రా లతోనూ, కేంద్ర పాలిత పాంత్రాలతోనూ.. సంప్రదింపులు జరుపుతోందని జైశంకర్ తెలిపారు. పోలీస్ వెరిఫికేషన్ ప్రాసెస్ ను ఎంపాస్ పోర్టు పోలీస్ యాప్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ యాప్ను ప్రస్తుతం 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 9000 పోలీస్ స్టేషన్లలో అమలు చేస్తున్నారు. పేపర్ రహిత డాక్యుమెంటనేషన్ ప్రాసెస్ కోసం ఇప్పటికే డిజీ లాకర్ సిస్టమ్ పాస్పోర్టు సేవా సిస్టమ్ ను విజయవంతంగా అనుసంధానం చేసినట్లు చెప్పారు. 

దేశవ్యాప్తంగా సగటున పోలీస్ వెరిఫికేషన్కు 14 రోజలు సమయం పడుతుందని గతంలో జైశంకర్ లోక్సభలో తెలిపారు. ఎంపాస్పోర్టు పోలీస్ యాప్ను ఉపయోగిస్తున్న రాష్ట్రా లు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్ల పరిధిలో వెరిఫికేషన్కు సగటున 5 రోజలు సమయం తీసుకుంటోందని తెలిపారు. పాస్పోర్టులు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. ఇంటర్నేషనల్ ట్రేడ్, పెట్టుబడులు, టూరిజం వృద్ధి, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, దౌత్యపరమైన సంబంధాలు వంటి అనేక అంశాల్లో పాస్పోర్టులు కీలకగా ఉన్నాయని చెప్పారు. 

పాస్పోర్టుల జారీ విషయంలో పారదర్శక విధానాలను అనుసరిస్తున్నామని, పౌరులకు మెరుగైన, ఖచ్చితమైన సేవలు అందిస్తున్నామని జైశంకర్ చెప్పారు. 2023లో 16.5 మిలియన్ల పాస్పోర్టు సంబంధిత సేవలు అందించినట్లు తెలిపారు. ఇది అంతకు ముందు సంవత్సరం కంటే 15 శాతం ఎక్కువ. 2023లో పాసపోర్టుల కోసం నెలవారి చేసుకుంటున్న దరఖాస్తుల సంఖ్య 14 లక్షలకు చేరింది.