తన ఎఫైర్ గురించి అడిగిందని భార్యపై పోలీస్ అధికారి దాడి: వీడియో

తన ఎఫైర్ గురించి అడిగిందని భార్యపై పోలీస్ అధికారి దాడి: వీడియో

తన అక్రమ సంబంధం గురించి నిలదీసిందని కట్టుకున్న భార్యను దారుణంగా హింసించాడు ఓ పోలీస్ అధికారి. అందరిముందు ఆమె జుట్టు పట్టుకొని నేలపై ఈడ్చాడు, పిడి గుద్దులు గుద్దాడు. అంతటితో ఆగకుండా కాలుకున్న చెప్పు తీసి కొట్టబోయాడు. మధ్యప్రదేశ్ లోని ధర్ లో జరిగిందీ సంఘటన.

గాంధ్వానీ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్న పోలీస్‌ అధికారి నరేంద్ర సూర్యవంశీ పరాయి స్త్రీతో అక్రమసంబంధం పెట్టుకున్నాడు. ఇందేంటని ప్రశ్నించిన భార్యను అందరూ చూస్తుండగానే చావగొట్టారు. అతని నుండి ఆమెను కాపాడేందుకు చుట్టుపక్కల వారు ప్రయత్నించినా రెచ్చిపోయి చేయి చేసుకున్నాడు. మరో విషయం ఏంటంటే పోలీసు యూనిఫాం ధరించిన మరికొందరు వ్యక్తులు అక్కడే ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఓ వ్యక్తి రికార్డ్ చేశారు. భర్త దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ ఇల్లాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

అయితే భార్య పట్ల  అనుచితంగా ప్రవర్తించిన పోలీసును అదుపులోకి తీసుకున్నామని విచారణ కొనసాగిస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.