స్కూలు ఫీజులు.. హాస్పిటల్​ చార్జీలపై నోరెత్తని పార్టీలు

స్కూలు ఫీజులు.. హాస్పిటల్​ చార్జీలపై నోరెత్తని పార్టీలు
  • స్కూలు ఫీజులు.. హాస్పిటల్​ చార్జీలపై నోరెత్తని పార్టీలు
  • ఎన్నికల ప్రచారంలో వినిపించని ప్రజల ప్రధాన సమస్యలు
  • తొమ్మిదేండ్ల నుంచి ఆరోగ్య శ్రీ లేదు.. కార్పొరేట్​ దోపిడీ ఆగలేదు
  • బడి ఫీజుల నియంత్రణ లేక సామాన్య జనం అవస్థలు
  • ఉచిత హామీలు, పరస్పర విమర్శలకే పార్టీల మొగ్గు

హైదరాబాద్, వెలుగు: పిల్లల బడి ఫీజుల కట్టడి, హాస్పిటల్ చార్జీల నియంత్రణపై రాజకీయ పార్టీలు నోరు ఎత్తడం లేదు. సామాన్యుల సంపాదనలో సగానికిపైగా విద్య, వైద్యానికే ఖర్చు అవుతున్నది. ముఖ్యంగా స్కూల్ ఫీజుల భారం పేద, మధ్య తరగతి తల్లిదండ్రులను తీవ్రంగా వేధిస్తోంది. అరకొర సౌలత్​లతో నడుస్తున్న సర్కారు బడులకు పిల్లలను పంపించలేక, ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల భారం మోయలేక సతమతవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మందిని వేధిస్తున్న ఈ సమస్య ఎన్నికల ప్రచారంలో ఎవరికీ పట్టడం లేదు. 

కనీసం ఒక్క పార్టీ కూడా ప్రైవేటు బడుల్లో ఫీజుల నియంత్రణ అంశాన్ని తమ మేనిఫెస్టోలో పెట్టలేదు. ప్రభుత్వ విద్య వ్యవస్థను బలోపేతం చేస్తామని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు చెబుతున్నా ప్రజలు నమ్మడం లేదు. కేజీ టు పీజీ ఉచిత విద్య అని గత రెండు పర్యాయాలు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాయి. కానీ, ఈ పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, ప్రభుత్వ యూనివర్సిటీలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్న విమర్శలు ఉన్నాయి. స్కూల్ ఫీజుల నియంత్రణ అంశాన్ని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు. ఎల్‌‌‌‌‌‌‌‌కేజీ, యూకేజీకి కూడా ఏడాదికి రూ.30 వేల నుంచి మొదలు లక్ష వరకూ వసూలు చేస్తున్నారు. లక్షకు మించి వసూలు చేస్తున్న స్కూళ్లు కూడా రాష్ట్రంలో ఉన్నాయి. ఈ దోపిడీని అరికట్టడానికి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 

వ్యాపారులే.. నాయకులు

విద్య, వైద్యం వంటి సేవ రంగాలు, ఇప్పుడు పూర్తిగా వ్యాపార రంగాలుగా మారిపోయాయి. ఈ వ్యాపారంలో కీలకంగా ఉన్న వ్యక్తులే, వివిధ పార్టీల్లో కీలక నేతలుగా ఉన్నారు. దీంతో ఆయా వ్యవస్థలను టచ్ చేసేందుకు ఆఫీసర్లు జంకుతున్నారు.

ఈ దోపిడీ ఆగేదెలా?

స్కూళ్ల మాదిరిగానే ప్రైవేటు, కార్పొరేట్ దవా ఖాన్లు కూడా దోపిడీ కేంద్రాలుగా మారిపోయాయి. టెస్టుల పేరిట లక్షల్లో చార్జ్ చేస్తున్నారు. ఈ బిల్లుల భారం భరించలేక ఎన్నో కుటుంబాలు అప్పుల పాలయ్యాయి. ఈ దోపిడీని ఏ మాత్రం అరికట్టని సర్కార్, ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ దవాఖాన్లలోనూ ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పుకుంది. కానీ, ఆరోగ్యశ్రీ బిల్లులను చెల్లించకపోవడంతో ఆ స్కీమ్ కింద ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ చేయడానికి హాస్పిటళ్లు ఒప్పుకోవడం లేదు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌‌‌‌‌‌‌‌ ఉన్నా, ఎంప్లాయీస్‌‌‌‌‌‌‌‌కు చికిత్స ఇవ్వడానికి సైతం హాస్పిటళ్లు నిరాకరించాయి. 

ఈ బాధలు భరించలేక ఉద్యోగులు, పెన్షనర్లు ఈహెచ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌లో మార్పుల కోసం పట్టుబట్టారు. చివరకు ఎన్నికలకు ముందు ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌లో మార్పులు చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్యశ్రీలో మాత్రం మార్పులు చేయలేదు. తమ ప్రభుత్వం ఏర్పడితే ఆరోగ్యశ్రీ కింద రూ.పది లక్షల వరకు ఉచితం వైద్యం అని కాంగ్రెస్ ప్రకటించింది. తమ ప్రభుత్వం వస్తే రూ.15 లక్షల వరకు ఉచిత వైద్యం అని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ పోటీ ప్రకటన చేసింది. ఈ పోటా పోటీ ఉచిత హామీలే తప్పితే, ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటళ్లలో ఫీజుల నియంత్రిస్తామని ఒక్క మాట కూడా పార్టీలు చెప్పలేకపోతున్నాయి.