IND vs AUS: హిట్ మ్యాన్ దగ్గరకు ఆసీస్ దిగ్గజం: కోహ్లీతో కాకూండా రోహిత్‌తో గిల్‌క్రిస్ట్ సెల్ఫీ.. కారణం ఇదే!

IND vs AUS: హిట్ మ్యాన్ దగ్గరకు ఆసీస్ దిగ్గజం: కోహ్లీతో కాకూండా రోహిత్‌తో గిల్‌క్రిస్ట్ సెల్ఫీ.. కారణం ఇదే!

అడిలైడ్ వన్డేకు ముందు ముచ్చట గొలిపే సీన్ ఒకటి చోటు చేసుకుంది. టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మతో ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ సెల్ఫీ తీసుకున్నాడు. గురువారం (అక్టోబర్ 23) అడిలైడ్ వేదికగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభమయ్యే సమయంలో ఈ సీన్ చోటు చేసుకుంది. ఒక ఆసీస్ దిగ్గజం ఇండియన్ క్రికెటర్ తో సెల్ఫీ తీసుకోవడం చాలా గొప్పగా భావించాల్సిన క్షణం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే కోహ్లీతో కాకుండా రోహిత్ శర్మతోనే గిల్‌క్రిస్ట్ సెల్ఫీ తీసుకోవడానికి కారణం లేకపోలేదు. 

ఐపీఎల్ లో రోహిత్, గిల్‌క్రిస్ట్ డెక్కన్ ఛార్జర్స్ తరపున ఆడారు. 2008 నుండి 2010 వరకు మూడు సీజన్ ల పాటు వేరు హైదరాబాద్ జట్టుకు ఆడారు. గిల్‌క్రిస్ట్ కెప్టెన్సీలో డెక్కన్ ఛార్జర్స్ తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. అప్పుడు రోహిత్ శర్మ జట్టులో సభ్యుడు. అప్పటి నుంచి వీరి మధ్య అనుబంధం కొనసాగుతూనే వస్తుంది. ఈ మూడు సీజన్ లలో జట్టుకు రోహిత్ వైస్ కెప్టెన్ గా చేశాడు. ఆ తర్వాత ముంబైగా ఇండియన్స్ జట్టులో చేరిన హిట్ మ్యాన్ తిరుగులేని ప్లేయర్ గా ఎదిగాడు. ముంబైకి ఏకంగా 5 టైటిల్స్ అందించి ఐపీఎల్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ కెప్టెన్ గా మారాడు. 

►ALSO READ | IND vs AUS: 17 ఏళ్ళ కెరీర్‌లో తొలిసారి: డకౌటైనా కోహ్లీకి స్టాండింగ్ ఒవేషన్.. చప్పట్లతో మారు మ్రోగిన అడిలైడ్ స్టేడియం

ఈ మ్యాచ్ లో రోహిత్ అరుదైన రికార్డ్ అందుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై వన్డే క్రికెట్ లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఇండియన్ బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్ లో స్టార్క్ బౌలింగ్ లో బౌండరీ బాదిన హిట్ మ్యాన్ ఈ ఘనతను అందుకున్నాడు. ప్రస్తుతం 68 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ఇండియా 2 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. క్రీజ్ లో రోహిత్ (68), శ్రేయాస్ అయ్యర్ (49) ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బార్ట్ లెట్ రెండు వికెట్లు తీసుకున్నాడు.