
కాంతార: చాప్టర్ 1: దసరా సందర్భంగా అక్టోబర్ 2 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి విధ్వంసం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద రోజుకో సరికొత్త రికార్డును సృష్టిస్తూ దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా రూ.780 కోట్లకుపై వసూళ్లు రాబట్టి వెయ్యి కోట్ల దిశగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అనౌన్స్ చేశారు. కాంతార:చాప్టర్ 1 మూవీని ఇంగ్లీష్ వెర్షన్ లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటిస్తూ వివరాలు వెల్లడించారు.
లేటెస్ట్ విషయానికి వస్తే: కాంతార:చాప్టర్ 1 ఈ నెల అక్టోబర్ 31న ఇంగ్లీష్ వెర్షన్లో విడుదల కానుంది. ప్రపంచఆడియన్స్కు నచ్చేలా, క్రిస్పీ రన్‌టైమ్‌తో ఇంగ్లిష్ వెర్షన్లో తీసుకురానున్నారు మేకర్స్. ప్రస్తుతం థియేటర్లో రన్ అవుతున్న అసలు నిడివి 2 గంటల 49 నిమిషాలు కాగా.. ఇపుడు ఇంగ్లిష్ వెర్షన్‌లో 2:14 గంటల రన్‌టైమ్‌తో వస్తుంది. మరి ఈ వెర్షన్‌లో ఎలాంటి సీన్స్ తొలిగించారో తెలియాలంటే, ఇంగ్లీష్ డబ్బింగ్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే!
అయితే, ఇప్పటివరకు చాలా ఇండియన్ సినిమాలు, ఇంగ్లీష్ వెర్షన్లో రిలీజ్ అయ్యాయి. కానీ, అసలు రన్ టైంని ట్రిమ్ చేసి, రిలీజ్ చేస్తుండటం ఇదే తొలిసారి. ఈ క్రమంలో ఇలా రిలీజ్ కానున్న తొలి భారతీయ సినిమాగా కాంతార:చాప్టర్ 1: నిలవనుంది.
►ALSO READ | Pavitra Punia: 'మళ్లీ ప్రేమలో పడిపోయా.. శ్రీమతిని కాబోతున్నా': బిగ్ బాస్ బ్యూటీ ఎంగేజ్‌మెంట్ పిక్స్ వైరల్
హోంబాలే ఫిల్మ్స్ (KGF ఫేమ్) నిర్మాణంలో రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, 2022 బ్లాక్‌బస్టర్ 'కాంతార'కు ప్రీక్వెల్గా వచ్చింది. ఇది క్రీ.శ. 300లో కదంబ రాజవంశం కాలంలో అడవులు, తెగల మధ్య సంఘర్షణ, ఆధ్యాత్మిక సంప్రదాయాలు, భూత కోల ఆచారాల మూలాలను అన్వేషిస్తుంది. ఈ చిత్రం కేవలం విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కోసమే కాక, దానిలోని ఆధ్యాత్మిక లోతు, సాంస్కృతిక ప్రాతినిధ్యం కోసం సోషల్ మీడియాలో విపరీతమైన ప్రశంసలు అందుకుంటోంది.
ఇందులో రిషబ్ శెట్టి శక్తివంతమైన యోధుడు బెర్మే అనే నాగ సాధువు పాత్రలో నటించగా, జయరామ్ విజయేంద్ర రాజుగా, రుక్మిణి వసంత్ కనకవతిగా, గుల్షన్ దేవయ్య కులశేఖరగా నటించారు.