
న్యూఢిల్లీ: వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్ హిస్టరీలో 700 మ్యాచ్‌లు ఆడిన తొలి ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. ప్రస్తుతం అమెరికా మేజర్ క్రికెట్ లీగ్ (ఎంఎల్‌సీ)లో పొలార్డ్ ఎంఐ న్యూయార్క్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మంగళవారం శాన్ ఫ్రాన్సిస్కోతో జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఫీట్‌ను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో శాన్ ఫ్రాన్సిస్కో 47 రన్స్ తేడాతో ఎంఐ న్యూయార్క్‌పై నెగ్గింది.
శాన్ ఫ్రాన్సిస్కో 20 ఓవర్లలో 246/4 స్కోరు చేయగా, ఎంఐ న్యూయార్క్ 199 రన్స్‌కే ఆలౌటైంది. 2006లో ట్రినిడాడ్ అండ్ టొబాగో తరఫున టీ20 అరంగేట్రం చేసిన పొలార్డ్.. వెస్టిండీస్, ఐపీఎల్, సీపీఎల్, బీబీఎల్, బీపీఎల్, అబుదాబి టీ20, టీ10లాంటి ఫ్రాంచైజీ క్రికెట్‌లో పాల్గొన్నాడు. 13,634 రన్స్‌తో పాటు 326 వికెట్లు తీశాడు. ఇక అత్యధిక టీ20లు ఆడిన లిస్ట్‌లో డ్వేన్ బ్రావో (582), షోయబ్ మాలిక్ (557) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.