మూడు జిల్లాల్లో పోలింగ్ శాతం ఇలా... రంగారెడ్డి జిల్లాలో 59.06 శాతం

మూడు జిల్లాల్లో పోలింగ్ శాతం ఇలా... రంగారెడ్డి జిల్లాలో 59.06 శాతం
  • చేవెళ్ల, షాద్​నగర్​లో రాత్రి 10 గంటల వరకు పోలింగ్

హైదరాబాద్/ రంగారెడ్డి/మేడ్చల్/షాద్ నగర్/చేవెళ్ల, వెలుగు :  అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​లో భాగంగా సిటీ శివారు జిల్లాల్లోనూ 60 శాతం లోపే పోలింగ్ నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో 59.06 శాతం పోలింగ్ నమోదైంది. ఎల్​బీనగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, కల్వకుర్తి, షాద్ నగర్ స్థానాల పరిధిలో చిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​తో  పోలిస్తే ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది. రంగారెడ్డి జిల్లాలో 2018లో 62 శాతం  నమోదు కాగా.. ఈ సారి 59.06 శాతం పోలింగ్ నమోదైంద. రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​ లో 9.30 గంటల వరకు, చేవెళ్లలో 10 గంటలకు  పోలింగ్ కొనసాగింది. చేవెళ్ల సెగ్మెంట్​లో 2 లక్షల 62 వేల 505 మంది ఓటర్లు ఉండగా.. లక్షా 94 వేల 558 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. చేవెళ్ల సెగ్మెంట్​లో పోలింగ్ శాతం 74.25 శాతం నమోదైంది. షాద్ నగర్ సెగ్మెంట్​లో లక్షా 93 వేల 714 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 81.96 నమోదైందని అధికారులు తెలిపారు. మొత్తంగా రంగారెడ్డి జిల్లాలో 59.06 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

మేడ్చల్ జిల్లాలో..

మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్, ఉప్పల్, మల్కాజి​గిరి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి  స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. 2018లో మేడ్చల్​జిల్లాలో 72 శాతం పోలింగ్ నమోదైంది.ఈసారి సాయంత్రం 5 గంటల వరకు 49.25 శాతం నమోదైంది.  పోతారంలో కొద్దిసేపు ఈవీఎంలు మొరాయించగా వాటిని మార్చాక మళ్లీ పోలింగ్ ప్రారంభమైంది.