
సినిమా సెలబ్రిటీలు అంతా ఒక్కదగ్గరికి చేరితే ఎట్లుంటది? వాళ్లను చూడటానికి ఎన్ని కళ్లు ఉన్నా సరిపోవు కదా! ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యాక్టర్లు , ఫిల్మ్ మేకర్లు ఫ్రాన్స్‌లోని కేన్స్‌కి చేరుకుంటరు. అక్కడ సినిమా ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ ‘కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’జరుపుకుంటరు. అంతమంది గ్లోబల్‌స్టార్లు ఒక్క దగ్గర చేరి ఆడుతుంటే.. పాడుతుంటే.. అందాలు.. ఆనందాలు వెదజల్లుతుంటే టీవీలల్ల చూస్కుంట ఫ్యాన్స్ మస్తు ఖుషీ అయితుంటరు. మరి, నేరుగా చూసే అవకాశమున్న కేన్స్ పట్టణ ప్రజలు ఇంకెంత ఖుషీ కావాలె? కానీ, అక్కడ సినిమా వాళ్లను చూడాలంటే మస్తు భయపడుతున్నరు !
సినిమావాళ్లు కేన్స్ కి వెళ్లి ఆగమాగం చేస్తున్నరంట. గాలి, నేల, నీరు అని తేడా లేకుండా పంచభూతాలను కాలుష్యం చేసి వస్తున్నరంట.‘సినిమా వాళ్లు ఇక్కడ ఉండే పది పదిహేను రోజులూ మాకు టార్చరే’అని అక్కడి స్థానికులు అంటున్నరు. మిరిమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అందరికీ కనపడ్తది కానీ, దాని పక్కనే ఉన్న ఎన్విరాన్‌మెంటల్ ఆర్గనైజేషన్ ‘ఏన్’ఎవరికీ అంత ఆకర్షణీయంగా కనిపించదు. ఈ ఫెస్టివల్‌పై ‘ఏన్’ ఎప్పటి నుంచో నిరసన తెలుపుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ గొప్పలు చెప్పుకుంటున్న ఈ ఈవెంట్ అసాధారణ రీతిలో కాలుష్యాన్ని వెదజల్లుతోందని ఏన్ మండిపడుతోం ది.
కేన్స్ చరిత్ర
ఈ కేన్స్ ఫెస్టివల్‌ని ప్రారంభించింది అప్పటి ఫ్రెంచ్ నేషనల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ జీన్ జే.చరిత్రకారుడు ఫిలిప్ ఎలాంగర్ సలహా మేరకు ఆయన కేన్స్ లో ‘ ఇంటర్నేషనల్ సినిమాటోగ్రాఫర్ ఫెస్టివల్’రూపొందించాడు. అదే తర్వాత ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అయింది. అలా 1938 వరకు జరుగుతూ వచ్చి .. రెండో ప్రపంచయుద్ధంలో హిట్లర్ దౌర్జన్యాల కారణంగా ఫిల్మ్‌ఫెస్టివల్ జరగలేదు. యుద్ధం తర్వాత తిరిగి 1946లో ఈ ఫెస్టివల్‌ను జరిపిన్రు. అప్పుడు దీనికి 21 దేశాల నుంచి సినిమా వాళ్లు వచ్చి న్రు. అలా ప్రతి సంత్సరం ఈ ఫెస్టివల్ జరుగుతోంది.ఈ ఏడాది 72వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 14 మే నుంచి 25 వరకు గ్రాండ్ గా జరిగిం ది.
ఏం చేస్తరు?
ప్రపంచ నలుమూలల నుంచి పెద్ద పెద్ద స్టార్స్ ,డైరెక్టర్స్ , ఫిల్మ్ మేకర్స్ ప్రతి సంవత్సరం కేన్స్ కి చేరుకుంటరు. అందాల ఆరబోత మొదలుకొని సినిమా, డాక్యు మెంటరీ ప్రదర్శన వరకు అన్నీ జరుగుతయ్ . గ్రాండ్ ఫొటోషూట్లు ఉంటాయి.ఇక పార్టీలకు లెక్కే లేదు. కొత్త సినిమాలను, కొత్త టాలెంట్ ని ప్రోత్సహిస్తూ సెలబ్రేట్ చేసుకోవడం, గొప్పవాళ్లకు అవార్డులు ఇవ్వడం ఈ ఫెస్టివల్ వెనుకున్న అసలు ఉద్దేశం.
మరి ఏం చేస్తున్నరు?
సెలబ్రిటీల దగ్గర డబ్బుకేం కొరత! అందుకే ఫెస్టివల్ గ్రాండ్ గా చేస్తరు. అక్కడికి చేరుకున్నంక ఒకరిని మించి మరొకరు తమ హోదాను చాటుకుంటరు. వంద మీటర్ల దూరానికి కూడా‘లిమోజీన్’కార్లలో తిరుగుతరు. ప్రైవేట్ జెట్లు వేసుకుని వస్తరు. “ప్రొఫెనషల్స్ , ఆర్టిస్టులు విమానాల్లో కేన్స్ ఎయిర్ పోర్ట్‌లో దిగుతరు.తర్వాత వాళ్ల కాన్వాయ్ వెహికల్స్.. వాటి ముందు మోటర్ సైకిళ్లు రయ్యున పోతుంటయ్ .అట్ల సైరన్ మోతలతో హోటళ్లకు చేరుకుంటరు. అక్కడి నుంచి కొంతమంది విలాసవంతమైన పడవల్లో సముద్రతీరంలో విహరిస్తరు. వాళ్ల వెహికల్స్ ఆ పన్నెండు రోజులు నడుస్తనే ఉంటయ్ ’అని ‘ఏన్’పర్యా వరణ వేత్తలు అంటున్నరు.‘కాస్ట్లీ ఎనర్జీ డ్రింక్స్ తాగి సీసాలు విసిరేస్తరు. వాళ్ల కోసం కిలోల కొద్దీ రుచికరమైన ఆహార పదార్థా లు తయారు చేస్తరు. కానీ, వాళ్లు ఆర్డర్ చేసి..తినకుండానే చెత్త డబ్బాలో పడేస్తరు. ‘ కేన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్ అంటేనే ఒక మురికి కూపం. కాలుష్యానికి ప్రతిరూపం’ అని వాళ్లు మండిపడుతున్నరు.
కుప్పలు తెప్పలుగా కాయితాలు
చుట్టూ విద్యుత్ కాంతులతో ఈ ఆడంబర వేడుకలకు ఫ్రాన్స్ ఆగ్నేయ తీరంలో ఉన్న ఫ్రెంచ్ రివేరా టౌన్‌ని ఆకర్షణీయంగా ముస్తాబు చేస్తరు. చిన్న గులకరాయి కూడా లేకుండా ఏరతరు. కాళ్లకు సన్నటి దుమ్ము రేణువు కూడా అంటకుండా రోజులో మూడు నాలుగు సార్లు రెడ్ కార్పె ట్ ని మారుస్తరు. వందలాది స్క్రీన్‌లు నడుస్తనే ఉంటయ్ . ఇక, అక్కడ వేలాది ఫెస్టివల్ ప్రింటవుట్స్ , అడ్వర్టైజ్ మెంట్ కాయితాలు గాలిలో ఎగురుతుంటయ్ . అవన్నీ ఎగురుకుంటూ చివరికి సముద్రం లో పడతయ్ . నిగనిగలాడే ఖరీదైన మేగజైన్లు రోజూ ప్రింట్ చేస్తూ పన్నెండురోజులూ పంచుతనే ఉంటరు. ఆ కాపీలను హలీవుడ్ రిపోర్టర్లకు ఇస్తరు. అవి కూడా చివరికి సముద్రం లోకే పోతయ్ .
పటాకులు.. పువ్వులు..
సముద్ర తీరంలో ప్రైవేట్ పార్టీలకు లెక్కేలేదు. ఫెస్టివల్ జరిగినన్ని రోజులూ పగలు రాత్రి తేడా లేకుండా తీరంలో మ్యూ జిక్ వినిపిస్తూనే ఉంటది.ఎవరి బిజీలో వాళ్లుంటరు. కొంతమంది తీరంలో నడుస్తుంటరు. మరికొందరు విలాసవంతమైన నౌకల్లో విహరిస్తుంటరు. “స్టార్ల కోరికలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించుకోండి?కుప్పలు తెప్పలుగా పువ్వులను ఆర్డర్ చేస్తరు. వాటిని వాడుతరా? అంటే అదీ లేదు.. నచ్చకుంటే మళ్లీ వేరే వాటిని తెప్పించుకుంటరు. అవి కొండల్లాగా పేరుకుపోతయ్. రకరకాల ఫుడ్ ని ఆర్డర్ చేస్తరు. దాన్ని తినకుండనే చెత్త బుట్టలో వేసేస్తరు’అని ‘ఏన్’ హెడ్ జీన్‌వేవ్ చెప్పింది. వాళ్లు పేల్చే బాణాసంచా ఆకాశాన్ని కాంతులతో నింపుతది.‘ఈ బాణాసంచా వల్ల గాలిలో దుమ్ము ధూళి పేరుకుంటోంది. వాటి శిథిలాలు, చెత్తచెదారం అంతా సముద్రం లోకే కొట్టుకుపోతది.ఈ ఫెస్టివల్ వల్ల కేన్స్ లో అదనంగా రెండు వేల టన్నుల చెత్త పుట్టుకొస్తోంది. ఇది సముద్ర పక్షులపై, సముద్ర జీవరాశులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏటా 30వేల మంది సినిమావాళ్లు కేన్స్ కి వస్తరు. ఈ టైంలో ఇక్కడ జనాభా మూడింతలు పెరుగుతది. నడిచే దూరానికి కూడా వీళ్లు వాహనాల్లోనే ట్రావెల్ చెయ్యడం వల్ల గాలి కాలుష్యం అవుతోంది’అని హచెట్ అన్నది.
శబ్ద కాలుష్యం
తీరంలో అవిరామంగా మ్యూ జిక్.. మరోవైపు బాణాసంచా చెవులకు విశ్రాంతి లేకుండా చేస్తయ్. ఇక ప్రైవేట్ విమానాల సౌండ్ చెవులను పొడిచేస్తది. కేన్స్ ఎయిర్ పోర్ట్ రికార్డుల ప్రకారం గతేడాది మేలో.. 1,700 ప్రైవేట్ విమానాలు టేకాఫ్ తీసుకున్నయ్ . అంటే ఫెస్టివల్ జరిగినన్ని రోజులు రోజుకు సగటున 54 విమానాలు వచ్చినయ్ . పెద్దగా శబ్దం చేసే ఇంజిన్ల వల్ల ప్లేన్ లు టేకాఫ్ తీసుకునే చోట ధ్వని 80 డెసిబల్స్ దాటుతది. ఇది ప్రజలకు చాలా ఇబ్బం ది కలిగిస్తోంది. “కొంతమంది స్టార్ లు తమ సౌండింగ్ జెట్స్ తో మా జీవితాలను నాశనం చేస్తున్నరు. ఫెస్టివల్ టైంలో మేం కిటికీలు తెరిస్తే.. బతకలేం ’అని స్థా నికుడు అల్బర్ట్ డూపిన్ చెప్పిండు.
మేయర్ ముచ్చట
ఇదిలా ఉంటే.. ఆ టౌన్ మేయర్ డేవిడ్‌లిస్‌నార్డ్ మాత్రం ఇంకో తీరుగా మాట్లాడుతున్నడు ‘ఇక్కడ అంత వేస్ట్‌జ్ అయితుందని నేను అనుకోవడం లేదు. ఇక, రెడ్ కార్పె ట్లను రీసైకిల్ చేస్తరు. బాణాసంచా వ్యర్థాలను తీసేసి తీర ప్రాంతాన్ని మొత్తం క్లీన్ చేస్తం’అంటున్నడు. మరి ధ్వని కాలుష్యం సంగతి ఏంటని పర్యావరణ వేత్తలు అడిగే ప్రశ్నకు ఆయన దగ్గర సమాధానం లేదు. కానీ, ‘చాలామంది స్టార్ లు మేం పర్యావరణ ప్రేమికులమని బయటకు చిత్రించుకుంటరు. కానీ, నిజ జీవితంలో దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తరు’అని స్వయంగా ఆ మేయరే అంగీకరిం చిండు. దానికి ఉదాహరణగా.. ‘ఆస్కార్ విన్నింగ్ యాక్టర్ లియోనార్డ్ డికాప్రియో తనకు తానే పర్యా వరణవేత్తనని ప్రకటించుకుండు. కానీ, అతని విలాసవంతమైన పడవలో నుంచి పెద్ద మొత్తంలో చెత్త పడేసి అందరిలాగే ఫైన్ కట్టిండు. ఈయన మళ్లా ‘ఐస్‌అండ్ ఫైర్ ’ అనే ఎన్విరాన్‌మెంటల్ డ్యాకుమెంటరీ కూడా తీసిండు ’అని చెప్పుకొచ్చిండు. కన్నుల పండువగా జరిగే ఈ ఫెస్టివల్ వెనక ఇంత కాలుష్యం ఉందన్నమాట! కానీ, ఇది మాత్రం టీవీలో కనిపించదు!!