పాలిటెక్నిక్ కౌన్సెలింగ్​ షెడ్యూల్ రిలీజ్

పాలిటెక్నిక్ కౌన్సెలింగ్​ షెడ్యూల్ రిలీజ్
  • 5 నుంచి ఆన్​లైన్ అప్లికేషన్లు,14న ఫస్ట్​ ఫేజ్​ సీట్ల కేటాయింపు

హైదరాబాద్, వెలుగు: పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్లకు కౌన్సెలింగ్ షెడ్యూల్ ​రిలీజ్​అయింది. ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ ఫస్ట్ వరకు ఈ ప్రక్రియ ఉంటుందని పాలిసెట్ చైర్మన్ నవీన్ మిట్టల్, కన్వీనర్ శ్రీనాథ్ పేర్కొన్నారు. షెడ్యూల్ ​ప్రకారం సెప్టెంబర్ 5 నుంచి పాలిటెక్నిక్ ఫస్ట్​ఇయర్​ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఫస్ట్ ఫేజ్అడ్మిషన్లకు ఆగస్టు 5 నుంచి 9 వరకు ఆన్​లైన్​లో ఫీజు చెల్లించి సర్టిఫికేట్ల వెరిఫికేషన్​కు స్లాట్ బుక్ చేసుకోవాలి. వారికి వచ్చే నెల 6 నుంచి 10 వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుంది. 12వ తేదీ వరకు కాలేజీలు, కోర్సుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆగస్టు14న సీట్లను అలాట్ చేయనుండగా, సీట్లు పొందిన స్టూడెంట్లు14 నుంచి 20 లోపు ఫీజు చెల్లించి వెబ్ సైట్​లో సెల్ఫ్​ రిపోర్టింగ్ చేయాలి. సెకండ్ ఫేజ్​లో ఆగస్టు 23న స్లాట్ బుకింగ్, 24న సర్టిఫికేట్ల పరిశీలన, 24, 25 తేదీల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుంది. ఆగస్టు 27న సీట్లు కేటాయిస్తారు. 

నేడు పాలిసెట్ రిజల్ట్ 
పాలిటెక్నిక్ కోర్సులతో పాటు ఆర్జీయూకేటీ, వెటర్నరీ, అగ్రికల్చర్ వర్సిటీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన పాలిసెట్ ఫలితాలు బుధవారం రిలీజ్ కానున్నాయి. మధ్యాహ్నం12 గంటలకు వెబ్ సైట్​లో రిజల్ట్ పెట్టనున్నారు. 1,02,496 మంది పాలిసెట్​కు అప్లై చేసిన విషయం తెలిసిందే. ఎంపీసీ, ఎంబైపీసీ పేర్లతో రెండు రకాల ర్యాంకులను కేటాయించనున్నారు.