సమ్మక్క-సారలమ్మ దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది: మంత్రి పొంగులేటి

సమ్మక్క-సారలమ్మ దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది: మంత్రి పొంగులేటి

మహాజాతరకు ముందే మేడారానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతన్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 19వ తేదీ సోమవారం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్క మేడారంలో పర్యటించారు. ఈ సందర్భంగా వనదేవతలను దర్శించుకున్నారు మంత్రులు. అనంతరం మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. సమ్మక్క-సారలమ్మ దీవెనలతో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు.

మేడారం జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారని.. ఇప్పటికే 58 లక్షలమంది వనదేవతలను దర్శించుకున్నారని తెలిపారు. మేడారంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే అన్నీ ఏర్పాటు పూర్తి చేశామని ఆయన చెప్పారు. భక్తుల కోసం దాదాపు 6 వేల ఆర్టీసీ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఏర్పాటు చేశారన్నారు. ఈసారి సుమారు 2 కోట్ల మంది భక్తులు సమ్మక్క-సారలమ్మ దేవతలను దర్శించుకుంటారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

మేడారానికి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా మంచినీటి సౌకర్యంతోపాటు వేల సంఖ్యలో టాయిలెట్లను కూడా ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. మేడారం జాతరలో 16వేల మంది అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారని చెప్పారు. మహాలక్ష్మీ పథకం కింద రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాల నుంచి మహిళలు మేడారం జాతరకు  ఫ్రీగా వచ్చేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని పొంగులేటి అన్నారు. మధ్యాహ్నం మేడారం జాతర ఏర్పాట్లు, భద్రతపై అధికారులతో మంత్రులు సమీక్ష చేయనున్నారు.