రాష్ట్రంలో కాంగ్రెస్ దే అధికారం: పొంగులేటి శ్రీనివాసరెడ్డి

రాష్ట్రంలో కాంగ్రెస్ దే అధికారం: పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కూసుమంచి, వెలుగు :  నా కళ్ల ముందే తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు. నా మెజారిటీ కనబడుతోంది. ఎట్టిపరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వమే వస్తుంది’ అని పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి  తెలిపారు. శుక్రవారం కూసుమంచి మండలంలోని మునిగేపల్లి, అగ్రహరం, నేలపట్ల, వెంకటాపురం, కోక్యాతండా, లోక్యా తండా, తురకగూడెం, కిష్టాపురం తదితర గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ తెలంగాణలో డిసెంబర్ 9న కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని జోస్యం చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చాక సోనియమ్మ ప్రకటించిన ఆరు హామీలను అమలు చేసి చూపిస్తామన్నారు. ఆయా గ్రామాల్లో పలువురు బీఆర్ఎస్ నాయకులు పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, రాయల నాగేశ్వరరావు, రాంరెడ్డి చరణ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు, బజ్జూరి వెంకటరెడ్డి, రమేశ్​రెడ్డి,సుధాకర్​రెడ్డి, జొన్నలగడ్డ రవి, తదితరులు పాల్గొన్నారు.