విద్య, వైద్యానికి ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రయారిటీ : మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

విద్య, వైద్యానికి ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రయారిటీ : మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • మాణిక్యాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గాంధీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విగ్రహావిష్కరణ

భీమదేవరపల్లి, వెలుగు : విద్య, వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రయారిటీ ఇస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. ఇందులో భాగంగా రూ. 1100 కోట్లతో 25 వేల స్కూళ్లలో తాగునీరు, విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టాయిలెట్లు, రంగులు వేయడం వంటి అనేక అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీలో సీటు సాధించిన హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గానికి చెందిన ప్రతి స్టూడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీజును తానే చెల్లిస్తానని ప్రకటించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గాంధీనగర్, మాణిక్యపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆదివారం జరిగిన అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు.

అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3 కారణంగానే తెలంగాణ ఏర్పడిందన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాగుంటుందన్నారు. ‘ఒక పూట తిన్నా తినకపోయినా, సీరియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూడడం బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి పిల్లల చదువుకు ప్రాధాన్యం ఇవ్వండి’ అని సూచించారు. ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం కమిటీ వేసిందన్నారు. గౌరవెల్లి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పూర్తి చేసి నీళ్లు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పారు.

హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గంలోని తిరుమల గార్డెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించే జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేళాను నిరుద్యోగులు వినియోగించుకోవాలని సూచించారు. అంతకుముందు అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంఘం జై భీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సభ్యులు భారీ ర్యాలీ నిర్వహించగా వారితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్​డప్పు కొట్టారు. అనంతరం ఏపూరి సోమన్న, రేంజర్ల రాజేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎంపీపీ అనిత, జడ్పీటీసీ వంగ రవి, ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీరన్న నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డ్యాగల సారయ్య, కవ్వ లక్ష్మారెడ్డి, తాళ్లపల్లి అయిలయ్య, తూముల సదానందం, గజ్జెల రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మంజులారెడ్డి పాల్గొన్నారు.

సభలో దళితబంధు రగడ

అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విగ్రహావిష్కరణ సభలో దళితబంధుపై కొంత గందరగోళం నెలకొంది. సభలో హనుమకొండ జడ్పీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ.. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హయాంలో రెసిడెన్షియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూళ్లలో స్టూడెంట్ల సంఖ్య పెరిగిందని, ఇప్పుడున్న ప్రభుత్వం మరిన్ని స్కూళ్లను పెంచాలని కోరారు. ఇదే టైంలో సభలోని కార్యకర్తలు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం దళితబంధు ఇవ్వకుండా మోసం చేసిందని నినాదాలు చేశారు.

అయితే నియోజకవర్గంలో 400 మందికిపైగా మంజూరు చేశామని, ఈ లోగా ఎన్నికలు రావడంతో ఇవ్వలేకపోయామని సుధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. మంత్రి జోక్యం చేసుకుని విగ్రహావిష్కరణ సభలో రాజకీయాలు ఎందుకని, కాంగ్రెస్​ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని అనడంతో కార్యకర్తల ఒక్కసారిగా నినాదాలు చేశారు. దీంతో జడ్పీచైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడకుండానే సభ నుంచి వెళ్లిపోయారు.