కవితను ఇంటికొచ్చి విచారిస్తరా ? సోనియా అయితే ఆఫీసుకు వెళ్లాలా ? 

కవితను ఇంటికొచ్చి విచారిస్తరా ? సోనియా అయితే ఆఫీసుకు వెళ్లాలా ? 

కరీంనగర్:  ఈడీ, సీబీఐ చుట్టూ తిరుగుతున్న మంత్రి గంగుల ప్రజల సమస్యలను ఏం పట్టించుకుంటారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ధరణి పోర్టల్ లో పేరుకుపోయిన 30 లక్షల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వయంగా మంత్రే ధరణి కేసులో కోర్టు వరకు పోవాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ ను రద్దుచేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ వద్ద నిర్వహించిన రైతు పోరు ధర్నాలో పొన్నం ప్రభాకర్ మాట్లాడారు.

కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 10 కిలోలు కట్ చేస్తున్నారని ఆరోపించారు.  ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి బీజేపీ, టీఆర్ఎస్ నేతలు కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. ‘‘ సీబీఐ విచారణ కవిత ఇంటికి వచ్చి  చేస్తారా? సోనియా అయితే ఆఫీస్ కి వెళ్లలేదా.. ? ఇదెక్కడి న్యాయం ? వెస్ట్ బెంగాల్ మాదిరిగా బీజేపీ, టీఆర్ఎస్  డ్రామాలు ఆడుతున్నారు. రైతులు తిరుగుబాటు చేసే రోజు వస్తది’’ అని పొన్నం కామెంట్స్ చేశారు.