'పొన్నియిన్ సెల్వన్ 1' ట్రైలర్ లాంచ్ .. కలర్ ఫుల్

'పొన్నియిన్ సెల్వన్ 1' ట్రైలర్ లాంచ్ .. కలర్ ఫుల్

చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష, బాబీ సింహలతో వస్తున్న మల్టీ స్టారర్ మూవీ  'పొన్నియిన్ సెల్వన్ 1'. ప్రముఖ దర్శకుడు మణిరత్నం భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ మూవీ సెప్టెంబరు 30న విడుదల కానుంది. ఈనేపథ్యంలో ఇవాళ చెన్నైలో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, ఆడియో లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఇందులో ఎంతోమంది సినీ తారలు తళుక్కుమన్నారు.  

పదో శతాబ్దం నాటి చోళ చక్రవర్తి ఆదిత్య 2 (ఆదిత్య కరికాలన్) తరఫున దక్షిణ భారతదేశంలోని రాజ్యాల చక్రవర్తులకు సందేశాలను అందించే వల్లవరయ్యన్ వాండియదేవన్ పాత్రలో కార్తీ నటించారు. ఈ పాత్ర చుట్టూనే  'పొన్నియిన్ సెల్వన్ 1'మూవీ కథ తిరుగుతుంది. ఆదిత్య కరికాలన్ పాత్రలో జయం రవి నటించారు. ఇవాళ విడుదల చేసిన ట్రైలర్ లో ఆదిత్య కరికాలన్ (జయం రవి), రాణి నందిని (ఐశ్వర్యా రాయ్) మధ్య రొమాన్స్ ను ఎంతో హృద్యంగా చూపించారు. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఐశ్వర్యారాయ్ మళ్లీ ఈచారిత్రక సినిమాలో నటించారు.