పాములతో వీడియో షూట్.. సింగర్ ముఖంపై కాటేసిన సర్పం

పాములతో వీడియో షూట్.. సింగర్ ముఖంపై కాటేసిన సర్పం

కొత్త కొత్త ప్రయోగాలు చేయడంలో ఈ జనరేషన్ వాళ్లు వెనకాడటం లేదు. కొన్నిసార్లు ఈ ప్రయోగాలు వారికి లేనిపోని ప్రమాదాలు తెచ్చి పెడుతున్నాయి. త్వరగా పాపులారిటీ పొందేందుకు.. వన్ నైట్ లో స్టార్ డమ్ సంపాదించుకునేందుకు లేనిపోని కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ పాప్ సింగర్ ఇలాంటి పనే చేసింది. పాములతో వీడియో షూట్ చేసేందుకు సిద్ధమైంది. నేలపై పరిచిన కార్పేట్ పై పడుకొని పాములతో సయ్యాటలాడింది. ఆమె పడుకొని ఒంటిపై పాములు వేసుకొంది. అయితే ఇంతలో ఓ పాము ఆమెను కాటేసింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. 21 ఏళ్ల పాప్ సింగర్ మెయిత.. నిజమైన పాముతో షూటింగ్​ చేసేందుకు సిద్ధమైంది. ఓ నల్ల పాము, ఓ తెల్ల పాముతో సాంగ్​ వీడియో షూట్​ చేస్తుడగా ఆమెకు అనుకోని షాక్ తగిలింది. 

నల్లటి పామును తన గుండెలపై పెట్టుకుని వీడియో, ఫొటోలకు ఫోజులిస్తుంది. ఇంతలో ఆమె నవ్వగానే.. ఆమె చిన్ పై  నల్ల పాము కాటేసింది. దీంతో ఆమె పెద్దగా అరుస్తూ.. అక్కడ నుంచి పాముని నెట్టేసి పైకి లేచింది. ఈ విషయాన్ని ఆ షూట్ లో పాల్గొన్న ఓ వ్యక్తి ముందుగా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ తర్వాత మెయిత కూడా ఇదే వీడియోను తన ఇనస్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. మీ అందరి కోసం వీడియోలు చేయడానికి నేను ఏం ఏం చేస్తున్నానో చూడండి’ నెవర్ ఎగైన్ అంటూ... మెయిత పోస్టు పెట్టారు. మరోవైపు ఈ వీడియో పోస్టు అయిన కొద్ది సేపట్లోనే దాదాపు 5 లక్షలమంది దీన్ని విక్షించారు. ప్రస్తుతం ఈ పాము కాటు వీడియో వైరల్ గా మారింది.