రోడ్డు ప్రమాదంలో.. మిమిక్రీ ఆర్టిస్ట్ మృతి

రోడ్డు ప్రమాదంలో.. మిమిక్రీ ఆర్టిస్ట్ మృతి

మలయాళ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ కొల్లం సుధీ(Kollam Sudhi)(39) మృతి చెందాడు. ఈ ప్రమాదం 2023 జూన్ 5 తెల్లవారుజామున ఉదయం 4.30 గంటల సమయంలో జరిగినట్లు తెలుస్తుంది. 

ఆదివారం వటకరాలో జరిగిన ఒక ఈవెంట్ కు కొల్లం సుధితో సహా.. బిను ఆదిమాలి, ఉల్లాస్, మహేశ్ వెళ్లారు. ఈవెంట్‌ ముగించుకుని కారులో తిరిగి వస్తుండగా తెల్లవారుజామున కారు అదుపుతపప్పి ఓ కంటెనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుధీ తలకు బలమైన గాయం కావడంతో.. సమీప ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగిలిన ముగ్గురు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

కొల్లం సుధీ 2015లో కంఠారి అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వరుసగా కుట్టనాదన్ మార్ప్పప్ప, కేసు ఈ వీడింటే నాధన్, ఎస్కేప్, స్వర్గతిలే కత్తురుంబు కొల్లం వంటి సినిమాలతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.