జనాభా నియంత్రణ విధానాన్ని దేశంలో అమలు చేయాలి : కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్

జనాభా నియంత్రణ విధానాన్ని దేశంలో అమలు చేయాలి  : కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్

న్యూఢిల్లీ : కుల, మత వర్గాలతో భేదం లేకుండా జనాభా నియంత్రణ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. జనాభా నియంత్రణ బిల్లు అత్యంత కీలకమైనదని చెప్పారు. జనాభా పెరుగుదలపై ఢిల్లీలో నిర్వహించిన ర్యాలీలో గిరిరాజ్ సింగ్ మాట్లాడారు.  

జనాభాను నియంత్రించేందుకు  చైనా వన్ చైల్డ్ పాలసీని  అమలు చేసిందని గుర్తు చేశారు. జనాభాను నియంత్రించి అభివృద్ధిని సాధించిందన్నారు. ప్రస్తుతం చైనాలో నిమిషానికి పది మంది పిల్లలు పుడుతుండగా.. అదే మన భారతదేశంలో నిమిషానికి 30 మంది చొప్పున పుడుతున్నారని కేంద్ర మంత్రి వెల్లడించారు. జనాభా నియంత్రణ కోసం ప్రతి ఒక్కరికీ వర్తించేలా బిల్లు ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు.