15‌‌0 కిలోమీటర్ల స్పీడ్తో డివైడర్ను ఢీ కొట్టిన కాస్ట్లీ కారు.. నుజ్జునుజ్జయింది..!

15‌‌0 కిలోమీటర్ల స్పీడ్తో డివైడర్ను ఢీ కొట్టిన కాస్ట్లీ కారు.. నుజ్జునుజ్జయింది..!

ముంబైలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేలోని జోగేశ్వరి ప్రాంతంలో బుధవారం రాత్రి వేగంగా వెళుతున్న పోర్షే కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. పోర్షే కారు, BMW రేసు పెట్టుకుని వెళుతుండగా 15‌‌0 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న పోర్షే కారు అదుపు తప్పి డివైడర్ ను కొట్టేసింది. ఈ ప్రమాదంలో పోర్షే కారు నుజ్జునుజ్జయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పోర్షే కారు నంబర్ DN 09Q 1777. ఈ కారు డివైడర్‌ను ఢీకొట్టి మోగ్రా మెట్రో స్టేషన్ సమీపంలో రోడ్డుపై నుజ్జునుజ్జయిన స్థితిలో పడి కనిపించింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన ఇద్దరినీ స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు మొదలైంది.

తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో, ముంబైలోని మోగ్రా మెట్రో స్టేషన్ సమీపంలో వేగంగా వస్తున్న పోర్స్చే కారు రోడ్డుపై ఉన్న గుంతలో పడి అదుపు తప్పిందని పోలీసులు తెలిపారు. ఈ కారణంగా కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిందని చెప్పారు. కారును నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగిందేమోననే అనుమానంతో అతని బ్లడ్ శాంపిల్స్ను సేకరించి పరీక్షిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇక మరో ఘటనలో.. ముంబైలోని కోస్టల్ రోడ్డులో ఎర్టిగా కారు మహాలక్ష్మి ఏరియా నుంచి వర్లి వైపు వెళుతుండగా కారు అదుపు తప్పి సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు డ్రైవర్‌ను మహారాష్ట్ర భద్రతా దళం (MSF) కాపాడింది.