పేరు మారింది: పోర్ట్ బ్లెయిర్ పేరు 'శ్రీ విజయ పురం'

పేరు మారింది: పోర్ట్ బ్లెయిర్ పేరు 'శ్రీ విజయ పురం'

అండమాన్ నికోబార్ దీవుల రాజధాని నగరమైన పోర్ట్ బ్లెయిర్ పేరును "శ్రీ విజయ పురం"గా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పోర్ట్ బ్లెయిర్‌కు శ్రీ విజయ పురం అని నామకరణం చేసినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం(సెప్టెంబర్ 13) సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 

వలసవాద ముద్రల నుంచి దేశాన్ని విముక్తి చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తి,  దార్శనికతలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా ట్వీట్‌లో పేర్కొన్నారు. దేశ చరిత్ర, స్వాతంత్య్ర పోరాటంలో శ్రీ విజయ పురానికి ఎనలేని స్థానం ఉందని కేంద్ర హోంమంత్రి తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో సాధించిన విజయానికి ఈ పేరు ప్రతీక అని అమిత్ షా అన్నారు.

"పోర్ట్ బ్లెయిర్ అనేది వలసరాజ్యాల పేరు. కొత్త పేరు శ్రీ విజయ పురం స్వాతంత్య్ర పోరాటాన్ని గుర్తుచేసేలా ఉంది. అమిత్ షా తీసుకున్న ఈ నిర్ణయం స్వాగతించదగినది. దీనికి మేము మద్దతు ఇఇస్తున్నాం.." అని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే తెలిపారు.

ALSO READ | రాహుల్పై ప్రధాని మోదీ ఆరోపణపై..విచారణ పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేత