తెరుచుకున్న బద్రీనాథ్‌ ఆలయం

తెరుచుకున్న బద్రీనాథ్‌ ఆలయం

ఉత్తరఖండ్‌: ప‌్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం బ‌ద్రీనాథ్ ఆల‌యం తెరుచుకుంది. శీతాకాల విరామం త‌ర్వాత‌ ఉత్తరఖండ్ ‌లోని బద్రీనాథ్‌ ఆలయం శుక్ర‌వారం తెల్లవారుజామున 4:30 గంటలకు తలుపులు తీశారు. అంతకు ముందు పూజారులు శాస్త్రోక్తంగా వేద మంత్రాలతో పూజలు నిర్వహించారు. లాక్ డౌన్‌ కారణంగా ఈ‌ కార్యక్రమంలో ఆలయ ప్రధాన పూజరితో సహా 28 మంది మాత్రమే హాజరయ్యారు. ఆలయం చుట్టూ బంతిపూలతో అందంగా అలంకరించారు. గత సంవత్సరం ఆలయం తెరిచిన మొదటి రోజు 10 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కాని లాక్ డౌన్‌ కారణంగా ఈ సంవత్సరం ఆ అవకాశం లేదు.

ఉత్తరఖండ్‌ సీఎం త్రీవేంద్రసింగ్‌ రావత్‌, గవర్నర్‌ బేబీ రాణి మౌర్య ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఏప్రిల్‌ 30వ తేదీన తెరుచుకోవాల్సిన ఆలయం తలుపులు లాక్ డౌన్‌ కారణంగా తెరుచుకోలేదని గుడి ధర్మాధికారి భవన్‌ చంద్ర ఉనియాల్‌ తెలిపారు. అలకనందా నది ఒడ్డున నార్‌, నారాయణ్‌ పర్వతాల మధ్య ఉన్న భద్రీనాథ్‌ ఆలయం ప్రసిద్ధి చెందిన సుందర ప్రదేశంగా పేరు ఉంది.