
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ తపాలా శాఖ భద్రాద్రి రామాలయంపై రూపొందించిన ప్రత్యేక పోస్టల్కవర్ను సిటీ ప్రధాన పోస్టల్ఆఫీసులో కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి దేవ్సిన్హా చౌహాన్ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ పోస్టల్కవర్ నువిడుదల చేయడం తన అదృష్టమని తెలిపారు. రాష్ట్రంలోని 6,266 పోస్టాఫీసుల ద్వారా 4.01 కోట్ల మంది ప్రజలకు సేవలు అందిస్తున్నామని చెప్పారు. వినూత్న ఆలోచనలతో పోస్టల్శాఖ ముందుకు పోతున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ రీజియన్పీఎంజీ శ్రీలత, డీపీఎస్దేవరాజ్, అడిషనల్ డైరెక్టర్ ఎన్ఎస్ఎస్రామకృష్ణ, ప్రాంతీయ పాస్పోర్టు అధికారి స్నేహజ, కార్పొరేటర్సురేఖ తదితరులు పాల్గొన్నారు.