జగిత్యాలలో కవిత పర్యటన.. వ్యతిరేకంగా పోస్టర్లు

జగిత్యాలలో కవిత పర్యటన.. వ్యతిరేకంగా  పోస్టర్లు

జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటనకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. మెట్ పల్లిలో   బీజేపీ ఆధ్వర్యంలో  వ్యంగ్యంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.  డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ వంటి అంశాలను హైలెట్ చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.  అయితే ఈ ఫ్లెక్సీలు  మీడియా కంట పడకముందే  మున్సిపల్ సిబ్బంది తొలగించారు.

ఇవాళ  కవిత జగిత్యాలలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి హాజరుకానున్నారు. ఈడీ విచారణ తర్వాత తొలి సారి జిల్లా పర్యటనకు వస్తున్న కవితకు ఘన స్వాగం పలికేందుకు పార్టీ కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు..  కవిత ప్రసంగంపై కూడా పార్టీ కార్యకర్తలు ఆసక్తిగా ఉన్నారు. 

మరో వైపు ఏప్రిల్ 1 నుంచి 30 వరకు జిల్లాలో పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా సభలు,సమావేశాలు నిర్వహించకూడదని సూచించారు. శాంతి భద్రతలకు ఆటంకం కల్గకుండా ప్రజలు సహకరించాలని కోరారు.