మట్టి కావాలని FB లో పోస్ట్…100 లారీలు తెచ్చారు

మట్టి కావాలని FB లో పోస్ట్…100 లారీలు తెచ్చారు

ఇంటి చుట్టుపక్కల ఉన్న ఖాళీ ప్రాంతాన్ని చదును చేయాలని, ఉచితంగా మట్టి కావాలంటూ ఓ మహిళ తన ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. అది కాస్త ఆమెకు కష్టాన్ని తెచ్చి పెట్టింది. ఈ ఘటన యూఎస్ లోని వర్జీనియా సమీపంలో ఉన్న స్ప్రింగ్ ఫీల్డ్ లో జరిగింది.  రోజ్ మేరీ వేగా అనే యువతి ఫేస్ బుక్ లో తన ఇంటి చుట్టు పక్కల గుంతలుగా ఉన్న ప్రాంతాన్ని చదును చేసేందుకు మట్టి కావాలని ఓ యాడ్ పెట్టింది. అంతే.. ఆ మరుసటి రోజు నుంచి జనాలు మట్టి తెచ్చి ఆమె యార్డ్ లో పోయడం ప్రారంభించారు. ఒక ట్రక్ 10 ట్రక్కులయ్యింది. 10 ట్రక్ లు 50 ట్రక్కులయ్యాయి. మొత్తం మీద 100 ట్రక్కులకు పైగా మట్టిని ఆమె యార్డులో పోసేసి వెళ్లిపోయారు జనాలు.

వారు తెచ్చిచ్చిన మట్టి దాదాపు 11 వేల చదరపు అడుగుల విస్తీర్ణానికి చేరింది. ఆ ఆవరణలోని 13 చెట్లు ధ్వంసం అయ్యాయి. అవసరానికి మించి మట్టి ఉండటంతో..దాన్ని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించడానికి డబుల్ ఖర్చైంది. మొత్తం 2.5 లక్షల డాలర్లను ఖర్చు చేయాల్సి వచ్చిందట. హౌస్ క్లీనింగ్ వ్యాపారాన్ని నడుపుకుంటున్న తనకు, ఈ మట్టి వ్యవహారం నష్టాన్ని తెచ్చిపెట్టిందని ఆవేదన వ్యక్తం చేసింది రోజ్ మేరీ.

మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ను ఫాలో అవ్వండి