హైదరాబాద్, వెలుగు: కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా జిల్లా పరిషత్ స్కూల్స్ హెడ్‌మాస్టర్లకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు పోస్టింగ్‌లు ఇచ్చారు. జీవో 317 ప్రకారం హెడ్‌మాస్టర్ కేడర్‌ను మల్టీజోన్ పోస్టుగా మార్చారు. అయితే కొత్త పోస్టింగ్‌ల్లో ఉమ్మడి జిల్లా యూనిట్‌గానే అలాట్‌మెంట్స్ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి హెచ్‌ఎంలకు స్కూల్ అలాట్‌మెంట్ మెసేజ్‌లు వచ్చాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 64 మంది, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 34 మందికి కొత్త స్కూల్స్ కేటాయించారు. మూడురోజుల్లో వారంతా కేటాయించిన స్కూళ్లలో రిపోర్టు చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్జేడీలు ఆదేశాలు జారీ చేశారు. అయితే టీచర్లకు స్పౌజ్ అప్పీల్స్‌కు అవకాశమిచ్చినట్టే, హెడ్‌మాస్టర్లకు కూడా ఇవ్వాలని జీహెచ్‌ఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్ ప్రభుత్వాన్ని కోరారు
