Women Special : కాన్పు తర్వాత బరువు ఇలా తగ్గొచ్చు

Women Special : కాన్పు తర్వాత బరువు ఇలా తగ్గొచ్చు

ప్రెగ్నెన్సీ టైంలో బరువు పెరగడం మామూలే. అయితే కాన్పు తర్వాత తిరిగి మునుపటి బరువుకి రావడం కష్టం. ఈ విషయంలో కొందరు బాలీవుడ్ సెలబ్రిటీ మదర్స్ మిగతా తల్లులకు ఇన్స్పిరేషన్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం, హెల్దీఫుడ్ తినడం ద్వారా బరువు తగ్గిచ్చు అంటున్నారు. 

ఈ ఏడాది మొదట్లో రెండో బిడ్డకు జన్మనిచ్చింది కరీనా కపూర్ ప్రెగ్నెన్సీ టైంలో బరువు పెరిగింది. అయితే మూడు నెలల్లోనే మామూలు బరువుకి వచ్చింది. రోజూ ప్లాన్ ప్రకారం వర్కవుట్స్ చేసేది. 'రెగ్యులర్గా 'ఏరియల్ సిల్క్ యోగ' చేశా. ఈ యోగతో బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది. బాడీ పోశ్చర్ బాగుంటుంది' అని చెప్పింది. 

  • శిల్పాశెట్టి కాన్పు అయిన 3 నెలల్లోనే 21 కిలోలు తగ్గింది. అందుకోసం రోజూ 20 నిమిషాల వర్కవుట్స్ లో భాగంగా వాకింగ్, మెట్లు ఎక్కి దిగడం, యోగ చేసేది. పండ్లు, కూరగాయలు ఉన్న హెల్దీఫుడ్ తినేది. 
  • బాలీవుడ్ క్వీన్ పేరు తెచ్చుకున్న ఐశ్వర్యరాయ్ రెగ్యులర్ గా పవర్ యోగా చేసేది. బ్రిస్క్ వాక్, జాగింగ్ చేసి బాడీని మునుపటి షేప్లోకి తెచ్చుకుంది. 
  • సమీరా రెడ్డి తన వెయిట్ లాస్ జర్నీని ఎప్పటికప్పుడు ఇన్స్టాలో పంచుకుంటూ ఉంటుంది.
  • ప్రెగ్నెన్సీ తర్వాత బరువు తగ్గడం కోసం 'ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్' చేసింది. 92కిలోలనుంచి 82 కిలోలకి వచ్చింది.
  • అంతేకాదు యోగ, ఇతర ఎక్సర్ సైజ్లు కూడా చేసేది.