ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ ఫిరాయింపులు ఊపందుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో సీటు ఆశించి భంగపడ్డ నేతలంతా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న టీడీపీ, జనసేన పార్టీల్లో ఈ ఫిరాయింపులు ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి. ఇప్పటికే సీటు దక్కని పలువురు కీలక నేతలు పార్టీలకు గుడ్ బై చెప్పగా కొంతమంది పార్టీలో ఉంటూనే నిరసన తెలియజేస్తున్నారు. తాజాగా జనసేన నేత పోతిన మహేష్ ఈ జాబితాలో చేరారు.
విశాఖ వెస్ట్ నుండి టికెట్ ఆశించిన మహేష్ ఆ సీటు దక్కకపోవడంతో గత కొంత కాలంగా బాహాటంగానే అసంతృప్తిని వెళ్లగక్కుతున్నాడు. ఈ క్రమంలో ఆయన రాజీనామాకు సిద్దపడ్డట్లు టాక్ వినిపిస్తోంది. మీడియాతో మాట్లాడుతూ మహేష్ తనకు రాదని తేలిపోయిందని, ఇక ఎదురు చూసి లాభం లేదని డిసైడ్ అయ్యానని అన్నారు. మరో రెండు మూడు రోజుల్లోనే తన భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తానని అన్నారు. మరి, మహేష్ జనసేనకు రాజీనామా చేసి వేరే పార్టీలో చేరతారా లేక, ఇండిపెండెంట్ గా పోటీకి దిగుతారా అన్నది వేచి చూడాలి.