23 మంది ప్రముఖులకు తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు

23 మంది ప్రముఖులకు తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు

హైదరాబాద్, వెలుగు : 2020లో లలితకళలు, సామాజిక రంగాలలో విశేష సేవలు అదించిన 23 మంది ప్రముఖులకు బుధవారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాలు ప్రదానం చేసింది. యూనివర్శిటీలోని ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఆర్ కళామందిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర గంథ్రాలయ సంస్థ చైర్మన్​అయాచితం శ్రీధర్ చీఫ్​ గెస్ట్​గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు విశ్వవిద్యాలయం లలితకళల సమాహారమని, ఇక్కడ చదువుకున్నవారు ధన్యజీవులని అన్నారు. పురస్కారాలకు ఎంపికైనవారికి అభినందనలు తెలిపారు.

వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్ రావు మాట్లాడుతూ.. యూనివర్శిటీ ప్రతి యేడు తెలుగు భాషా సాహిత్యం, సంస్కృతి, లలిత కళారంగాలలోనే కాకుండా విభిన్న శాస్త్రాల్లో నిష్ణాతులైన సుమారు 70 మంది ప్రముఖులను ఎంపిక చేసి పురస్కారాలతో సత్కరిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్శిటీ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేశ్, జానపద కళల శాఖ పద్యనాటక శిక్షకుడు గంగాధర్, డప్పు వాద్య శిక్షకుడు సంజీవ తమ కళలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.