‘ఔషధ ఫలం’ .. అల్లనేరేడు

‘ఔషధ ఫలం’ .. అల్లనేరేడు

అల్లనేరేడు పండుని ‘ఔషధ ఫలం’ అని పిలుస్తారు . బెరడు, ఆకులు, పండ్లు.. ఇలా అల్లనేరేడు చెట్టు ప్రతీదాంట్లోనూ ఔషధ గుణాలుంటాయి. ముఖ్యం గా షుగర్‌ షేషెంట్లకు ఈ చెట్టు ఒక దివ్యౌషధంగా పని చేస్తది. వేసవిలో దాహార్తి సమస్యను తీర్చి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అల్ల నేరేడును ‘పవర్‌ హౌజ్‌ ’గా అభివర్ణిస్తారు వైద్యులు. టెక్నాలజీ పరంగా కూడా ఈ చెట్టుతో ఉపయోగాలున్నాయని చెప్తున్నారు సైంటిస్టులు.

తేనె నుంచి వైన్‌ దాకా…
అల్లనేరేడు పండు, గింజలు, ఆకులు, బెరడు.. అన్నింటిలో యాం టీ–బయాటిక్‌ గుణాలున్నాయి. అందుకే ఐస్‌ క్రీమ్‌ దగ్గరి నుం చి టానిక్‌ ల దాకా దాదాపు ప్రతీ కమర్షియల్‌ ప్రొడక్ట్‌‌ల్లో నూ జామూన్‌ (అల్లనేరేడు)కి ప్రాధాన్యత ఇస్తారు. ఇంట్లో ఉపయోగించే వెనిగర్‌ కోసం పచ్చి అల్లనేరేడు పండ్లను వాడతారు . ఈ పండ్ల నుంచి తయారు చేసే పాకాన్ని ‘జామూన్‌ హనీ’ పేరుతో అమ్ముతారు. దీని నుంచి తయారు చేసే ‘వైన్‌ ’కి ప్రత్యేక గుర్తింపు ఉంది. కేం ద్ర నాడీ మండలం అతి చురుకు దనాన్ని తగ్గించే గుణం ఉంటుంది ఈ వైన్‌ కి. అంతేకాదు ఫంగల్ ఇన్‌ ఫెక్షన్‌ ల నుంచి రక్షిస్తది. అల్లనేరేడు పండ్ల జ్యూస్‌, తొక్కలతో పేస్‌ ప్యాక్‌ తయారు చేసుకోవచ్చు. ఇది ముఖాన్ని కాంతివంతంగా చేయడంతో పాటు జిడ్డు, మొటిమల సమస్యల్ని నివారిస్తది. చాక్లెట్‌ , జ్యూస్, సిరప్‌ ల తయారీలోనూ అల్లనేరేడును ఉపయోగిస్తున్నారు. డైల్యూట్‌ జ్యూస్‌ ను ఇన్‌ ఫెక్షన్లకు ఉపయోగిస్తారు.

బెర్రీ ఫ్రూట్స్‌ తో పాటు అల్లనేరేడులో ‘ఆంథోసియానిన్‌ ’ అనే యాంటి ఆక్సిడెంట్‌‌ ఉంటుంది. ఆంథోసియానిన్ కారణంగా బెర్రీ ఫ్రూట్స్‌ కి డార్క్ కలర్‌‌ వస్తుంది. ఈ రసాయనాలు మెదడులో విడుదలై..మనిషి మూడ్‌ ని మార్చేస్తాయి. జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరుస్తాయి. ఈ ఆంథోనియం ఉపయోగించి ‘డై–సెన్సి టైజ్డ్‌ సోలార్‌‌ సెల్స్‌ ’ను తయారు చేయొచ్చట. ఇందుకు అయ్యే ఖర్చుకూడా చాలా తక్కువని అంటున్నారు
ఐఐటీ–రూర్కీ పరిశోధకులు. ఐఐటీ హైదరాబాద్‌ సైంటిస్టులు ఫ్లోరైడ్‌ సమస్యను తీర్చేందుకు అల్లనేరేడు గింజలతో ప్రయోగాలు చేస్తున్నారు. గింజల పౌడర్‌‌తో కార్బన్‌ ను తయారు చేసి.. దాని ద్వారా కలుషితమైన నీటిలోని ఫ్లోరైడ్‌ ని తొలగించారు. ఈ పరిశోధనలు ఫలిస్తే.. ఫ్లోరైడ్‌ సమస్య ఉన్న ప్రాంతాల్లో మంచి నీటిని అందించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ టెక్నాలజీకి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ.

మిరాకిల్‌ ఫ్రూట్‌
వగరు, తీపి, పులుపు రుచుల మేళవింపు అల్లనేరేడు సొంతం. వేసవి సీజన్‌ ముగిసే సమయంలో ఎండలు ఎక్కువగా ఉంటయ్‌. ఈ టైంలో ఈ పండ్లను ఎక్కువగా తింటే వేడి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ పండ్లను కనీసం రోజుకి పదైనా తింటే మంచిది. ఇది ఆకలిని పెంచుతుంది. వీటిలో ఉండే యాసిడ్‌ గుణం వల్ల కడుపులోకి వెళ్లే వెంట్రుకలు, లోహపు ముక్కలు కరిగిపోతాయి. అందుకే దీనిని ‘మిరాకిల్ ఫ్రూట్‌‌’ అంటారు.
జీర్ణక్రియను మెరుగుపర్చడంతో పాటు విరేచనాల్ని సాఫీ చేస్తుంది. అల్లనేరేడు పండు రక్తంలోని షుగర్‌‌ నిల్వలను నియంత్రిస్తుంది. ఔషధ గుణాలు ఉండటంతో మెడిసిన్‌ తయారీలో దీనిని ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేద, సంప్రదాయ హీలింగ్‌ వైద్య విధానంలో అల్లనేరేడుకి ప్రాధాన్యత ఉంది. నోటి దుర్వాసనను పోగొట్టే స్వభావం ఉంది.

‘ప్లమ్‌‘ప్లమ్‌ ట్రీ’ట్‌ మెంట్‌

అల్లనేరేడు బెరడు, ఆకుల రసాన్ని పుక్కిలిస్తే చిగుళ్ల వ్యాధి తగ్గుతుంది. ఈ రసం నోటి దుర్వాసనను అరికడుతుంది. పొరపాటున మింగినా ఫర్వాలేదు. కడుపులో నులిపురుగుల్ని అరికడుతుంది. అల్లనేరేడు ఆకుల్లో ‘విటమిన్‌ –ఎ, విటమిన్‌ –సి’ ఉంటాయి. ఆకుల్ని ఎండబెట్టి, ఆ పొడిలో ఉప్పు కలిపి తోముకుంటే మంచిది. పచ్చి ఆకుల్ని నలిపి గాయాలపై కడితే తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది. కాలిన గాయాలపై
పసరు పూస్తే మచ్చలు ఏర్పడకుండా నివారించొచ్చు. పిల్లల్లో కళ్లు ఎర్రబడి అంటుకుపోతే.. లేత ఆకుల కషాయంతో కళ్లను కడిగితే ఆ సమస్య తగ్గుతుంది. డయేరియా, మొలల సమస్యలకు లేత ఆకుల కషాయం మందుగా పని చేస్తుంది. అల్లనేరేడు గింజల్ని దంచి ఆ పొడితో
కషాయం కాచి.. పాలు, తాటి కలకండ కలిపి తాగితే అతిమూత్రం, మధుమేహ సమస్యలు అదుపులోకి వస్తాయి. గింజల బదులు పండ్లతో పానకం చేసుకుని రోజూ రెండు చెంచాలు తాగితే దగ్గు, రక్త హీనత తగ్గు తాయి. చెవిలో చీము సమస్య ఉంటే… ఆకులు, పండ్లను రసం చేసి, ఆ
మిశ్రమాన్ని వేడి చేసి రెండు మూడు చుక్కలు చెవిలో వేస్తే ఉపశమనం కలుగుతుంది. ఈ రసం కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది. కాలేయ సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. ఆస్తమా, అర్థా రైటిస్‌ వ్యాధుల కోసం తయారుచేసే ఆయుర్వేద మందుల్లో అల్లనేరేడుని వాడతారు. చర్మ సంబంధిత వ్యాధుల్ని సైతం నయంచేస్తుంది. అయితే అల్లనేరేడు కన్నా కాకినేరేడు పండ్లను ఎక్కువగా తీసుకోవాలని డైటీషియన్లు సూచిస్తున్నారు.