‘నుడా’ చైర్మన్‌‌‌‌ పీఠం నిజామాబాద్ జిల్లా టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లో చిచ్చు

‘నుడా’ చైర్మన్‌‌‌‌ పీఠం  నిజామాబాద్ జిల్లా టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లో చిచ్చు

నిజామాబాద్,  వెలుగు: ‘నుడా’ చైర్మన్‌‌‌‌ పీఠం జిల్లా టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లో చిచ్చు పెడుతోంది. ఈ వ్యవహారం రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌‌‌‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మధ్య ఆధిపత్య పోరుకు దారితీస్తోంది. ఇద్దరూ తమ అనుచరులకు చైర్మన్​ పదవి కట్టబెట్టాలని పట్టుబడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది గడువు ఉండగా ఇంటి పోరు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.  

ఐదేళ్లుగా...

నిజామాబాద్ అర్బన్ డెవెలప్‌‌‌‌మెంట్‌‌‌‌ అథారిటీ (నుడా)  ఐదేళ్ల కింద ఏర్పడింది. తొలి చైర్మన్‌‌‌‌గా  ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డిని నియమించారు. అర్బన్‌‌‌‌ నియోజకవర్గానికి చెందిన ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే గణేశ్‌‌‌‌ గుప్తాలకు అనుచరుడిగా ఉన్నారు. సామాజిక సమీకరణాలతో మంత్రి ప్రశాంత్‌‌‌‌రెడ్డికి దగ్గరయ్యాడు. టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నిర్మాణ
బాధ్యతలు ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డికే అప్పగించారు. గతంలో ఓ సారి నుడా పాలకవర్గం మార్చాలనే ప్రతి పాదన వచ్చినా మంత్రి జోక్యంతో నిలిచిపోయింది. ఐదేళ్లు దాటి పోవడంతో కొత్త వారిని నియమించాలని కొందరు సీనియర్లు పట్టుబడుతున్నారు. 

తెరపైకి సంజీవరెడ్డి పేరు...

రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్‌‌‌‌ బాజిరెడ్డి గోవర్ధన్ మరోవైపు రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌‌‌‌రెడ్డి ఎవరికి వారు తమ అనుచరులకు నూడా చైర్మన్ పదవి దక్కేలా పావులుకదుపుతున్నారు. వీరిద్దరి పంతం పెరగడంతో మిగతా ఎమ్మెల్యేలు ఈ వ్యవహారానికి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుత చైర్మన్ ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డినే ఇంకా కొంతకాలం కొనసాగించాలని మంత్రి భావిస్తున్నారు. కానీ బాజిరెడ్డి మాత్రం తనకు సన్నిహితుడైన ఉద్యనేత, టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ రైతు విభాగం మాజీ అధ్యక్షుడు ఈగ సంజీవరెడ్డి పేరును 
తెరపైకి తెచ్చారు. ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను కలిసి ఈ విషయంపై చర్చించినట్టు తెలుస్తోంది. పార్టీలో సీనియర్లు, ఉద్యమకారులకు పదవి ఇవ్వాలని కోరినట్లు చెబుతున్నారు. ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి సామాజిక వర్గం నుంచి సంజీవ్‌‌‌‌రెడ్డిని తెరపైకి తేవడంతో రెడ్డి వర్సెస్‌‌‌‌ రెడ్డిగా మారింది. 

పావులు కదుపుతున్న నేతలు...

బాజిరెడ్డి గోవర్ధన్ నుడా పీఠంపై పట్టుబట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. పైకి బాగానే ఉన్నా మొదటి నుంచి ప్రశాంత్‌‌‌‌రెడ్డిని ఆయన విభేదిస్తున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను కాదని కేవలం రెండు సార్లు గెలిచిన ప్రశాంత్‌‌‌‌రెడ్డి కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వడంపై  మూడేళ్ల పాటు అసంతృప్తి వెళ్లగక్కారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడిందని ప్రచారం ఉంది. ఆర్టీసీ చైర్మన్ పదవితో అప్పగించినా తగిన ప్రాధాన్యం లేదనే అసంతృప్తిగానే ఉన్నారు. కనీసం అనుచరులకు నామినేటెడ్ పదవులు ఇప్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అందుకే నుడా పదవిపై పట్టుబడుతున్నారు. ఈ క్రమంలోనే ఈగ సంజీవ్‌‌‌‌రెడ్డిని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.  ఇద్దరు ముఖ్య నేతలు ఒక పదవి కోసం పట్టుదలగా వ్యహరించడం చర్చనీయాంశమైంది.  దీంతో నుడా చైర్మన్ పీఠం వ్యవహారం రచ్చకెక్కింది. వివాదం ముదరి వర్గపోరుకు దారితీయకముందే రాజీ కుదిర్చేందుకు పార్టీ  ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.