
చాలా గ్యాప్ తర్వాత ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో అనుష్క ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఇప్పటికే ప్రమోషన్స్‌లో జోరు పెంచింది. ఈ సినిమాలో అనుష్క చెఫ్ రోల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే.
Also Read :- పెళ్లి ఎప్పుడు అంటే.. అంతెత్తు లేస్తున్న సీనియర్ హీరోయిన్
ఇటీవల తనకు ఇష్టమైన వంటకాన్ని షేర్ చేయాలని ఈ బ్యూటీ రెబల్ స్టార్ ప్రభాస్‌కు చాలెంజ్ విసిరింది. తనకు రొయ్యల పులావ్ అంటే ఎంతో ఇష్టమంటూ తన రెసిపీని ప్రభాస్షేర్ చేశాడు. ఇప్పుడు మెగా హీరో రాంచరణ్ వంతు వచ్చింది. ప్రభాస్ ఈ చాలెంజ్‌ను రాంచరణ్‌కి విసిరాడు. దీంతో చెర్రీ ఎలాంటి రెసిపీని పంచుకుంటాడా అని నెట్టింట ఆసక్తి మొదలైంది. నవీన్ పొలిశెట్టితో అనుష్క తొలిసారి నటించింది. ఈ ఇద్దరి కాంబినేషన్‌ను తెరపై చూసేందుకు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ 2023, సెప్టెంబర్ 7వ తేదీ థియేటర్లలోకి రానుంది.