
తన పెళ్లిపై అడిగిన ప్రశ్నకు హీరోయిన్ తమన్నా సీరియస్ అయ్యింది. ఫ్యాన్స్ మీట్లో భాగంగా ఓ అభిమాని అత్యుత్సాహం ఆమెకు కోపం తెప్పించింది. నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరిద్దరి షికార్లు బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతున్నాయి.
ఇంతకీ పెళ్లెప్పుడు చేసుకుంటారు.. తమిళనాడులో మీకసలు అబ్బాయిలే దొరకలేదా? అని ఓ ఫ్యాన్ ఆమెను అడిగాడు. దీంతో తమన్నా ఘాటుగా స్పందించింది. నా తల్లిదండ్రులే నన్నెప్పుడూ ఇలా అడగలేదు. అయినా, నా జీవితం ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అంటూ ఈ బ్యూటీ చిరుబురులాడింది. ఇక నెగిటివిటీని తానస్సలు పట్టించుకోనని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. ఎవరి అభిప్రాయం వారిది దానిని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదని తమన్నా తెలిపింది.
Also Read :- జైలర్ ఇంట్లోకి వచ్చేశాడు.. శ్రీకృష్ణాష్టమి స్పెషల్ OTT మూవీ
ఏ మాటకు ఆ మాటే అనుకోవాలి.. 35 ఏళ్ల వచ్చాయి కదా పెళ్లి ఎప్పుడు అన్నదానికే ఇంత సీరియస్ అవ్వాలా అంటున్నారు ఫ్యాన్స్. ఏమైనా నచ్చిన హీరోయిన్ పెళ్లి చేసుకోవాలని ఏ ఫ్యాన్ కు మాత్రం ఉండదండీ.. ఈ మాత్రం అర్థం చేసుకోకుండా తమన్నా ఇలా చిర్రుబుర్రులాడటం ఏం బాగోలేదంటున్నారు ఫ్యాన్స్.