
హైదరాబాద్: ప్రభాస్ తదుపరి సినిమా గురించి మరో సర్‌ప్రైజ్ రివీల్ అయింది. డార్లింగ్ 21వ మూవీలో ఆయన సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొణె నటించనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి తాజాగా మరో అప్‌డేట్‌ను మూవీ టీమ్ తెలిపింది. సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ బిగ్ బీ, లెజెండరీ అమితాబ్ యాక్ట్ చేయనున్నారని సినీ యూనిట్ వెల్లడించింది. సపోర్టింగ్‌లో రోల్‌లో కాకుండా సినిమాలో ఎక్కువ భాగం సన్నివేశాల్లో అమితాబ్ కనిపించున్నారని డైరెక్టర్ నాగ్ అశ్విన్ పేర్కొన్నాడు. అమితాబ్ హోదాకు తగ్గట్లుగా ఆయన పాత్రకు ఎక్కువ సీన్స్ ఉంటాయన్నాడు. ప్రభాస్ కూడా లేటెస్ట్ అప్‌డేట్‌పై స్పందించాడు. లెజెండరీ నటుడు బిగ్ బీతో స్క్రీన్ షేర్ చేసుకోవాలన్న కల నెరవేరనున్నందుకు సంతోషంగా ఉన్నానని ప్రభాస్ చెప్పాడు. తెరపై ప్రభాస్, అమితాబ్‌లు కలిసి అలరిస్తే ప్రేక్షకులకు అంతకన్నా సంతోషం ఏముంటుంది.