Kalki 2898 AD: భవిష్యత్ కాశీలో భైరవ..ప్రభాస్ కల్కి నుండి కొత్త అప్డేట్

Kalki 2898 AD: భవిష్యత్ కాశీలో భైరవ..ప్రభాస్ కల్కి నుండి కొత్త అప్డేట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898 AD). టాలీవుడ్లో క్రియేటీవ్ డైరెక్టర్గా పేరుతెచ్చుకున్న నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 

నేడు మహా శివరాత్రి (మార్చి 8) సందర్భంగా కల్కిలో ప్రభాస్ పాత్ర పేరును అనౌన్స్ చేశారు. భైరవ అనే పాత్రలో ప్రభాస్ నటిస్తున్నట్లు తెలిపారు.భవిష్యత్తు కాశీలో భైరవ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ లో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. స్టైలిష్ లుక్ లో ప్రభాస్ కనిపించాడు. గాగుల్స్, స్లీవ్ లెస్ డ్రెస్ ..కండలు తిరిగిన దేహంపై టాటూ, పోనీటైల్ హెయిర్ తో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాడు. ప్రస్తుతం కల్కి  భైరవ పోస్టర్ సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. త్వరలో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ తో పాటు ట్రైలర్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. 

ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటాని వంటి స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో, ఇండియన్ మైథాలజీకి లింక్ చేస్తూ వస్తున్న ఈ సినిమా హాలీవుడ్ రేంజ్లో రాబోతుంది. ఈ సినిమా మే 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.