పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కామెడీ చిత్రాల దర్శకుడు మారుతి తెరకెక్కిస్తోన్న 'ది రాజాసాబ్' నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
"మేము మొదలుపెట్టిన ఈ క్రేజీ జర్నీలో.. మేము రూపొందించిన డార్లింగ్ రెబెల్ పాత్రతో అక్టోబర్ 23న వస్తున్నాడు" అంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో ప్రభాస్ స్టైలిష్ అండ్ ట్రెండీ లుక్తో అదరగొట్టారు. ఇక ప్రభాస్ బర్త్డే (అక్టోబర్ 23న) స్పెషల్గా ది రాజాసాబ్ నుంచి టీజర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ మరియు రిద్ధి కుమార్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. కాగా ఈ మూవీకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 2025 ఏప్రిల్ 10న సినిమాను విడుదల చేయనున్నారు.
ఇక ప్రభాస్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఆయన హీరోగా వచ్చిన కల్కి 2898 ఏడీ ఇటీవలే థియేటర్స్ లోకి వచ్చి హాలీవుడ్ రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా తరువాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలుకానుంది. అలాగే సీతారామం ఫేమ్ హను రాఘవపూడి డైరెక్షన్లో మరో మూవీ (ఫౌజీ) చేస్తున్నారు.
A journey we built.
— Director Maruthi (@DirectorMaruthi) October 21, 2024
A Darling Rebel character we shaped :)
HE IS ARRIVING on 23rd oct 🔥💥#Prabhas #TheRajaSaab pic.twitter.com/Da7MPyLnpV