అభిమానులతో పరాచకాలా.. చీప్ ట్రిక్స్ ప్లే చేయకండి

అభిమానులతో పరాచకాలా.. చీప్ ట్రిక్స్ ప్లే చేయకండి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా చేస్తున్న భారీ మూవీ ప్రాజెక్ట్ కే(Project K) కోసం మేకర్స్ చేస్తున్న ప్రమోషనల్ స్టెంట్స్ పై మండిపడుతున్నారు ఫ్యాన్స్. ఫ్యాన్స్ తో పరచకాలా.. మాతో ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబందించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఇటీవల ప్రమోషన్స్ లో భాగంగా ప్రాజెక్ట్ కే అంటే ఏంటి? ప్రపంచం ఏం తెలుసుకోవాలనుకుంటోంది? అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో భాగంగా ఫ్రీ గా ప్రాజెక్ట్ కే టీ షర్ట్స్ ఇస్తామని కూడా ప్రకటించారు. దీనికి సంబంధించి ఒక లింక్ కూడా యాడ్ చేశారు. అయితే ఇలా ఇప్పటికే మూడు సార్లు మేకర్స్ ప్రకటన చేశారు. కానీ ఒక్కసారి కూడా టీ షర్ట్స్ ను అందుబాటులో ఉంచలేదు. 

దీంతో మూవీ టీమ్ ఆడియన్స్ ను చీట్ చేస్తోందంటూ కామెంట్స్ పెడుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇప్పటికి మూడు సార్లు ఇలా ప్రకటిచారని, ఎప్పుడు ఓపన్ చేసినా సర్వర్ ఎర్రర్ అని చూపిస్తుందని కామెంట్స్ పెడుతున్నారు. ఇలా ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకోవడం కరక్ట్ కాదని,  ఫ్యాన్స్  తో ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకండి అంటూ మేకర్స్ పై మండిపడుతున్నారు. మరి ఈ కామెంట్స్ పట్ల ప్రాజెక్ట్ కే మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.