ప్రభాస్ రెమ్యునరేషన్ రూ.100 కోట్లు?.. ఇండియాలోనే టాప్ యాక్టరా!

ప్రభాస్ రెమ్యునరేషన్ రూ.100 కోట్లు?.. ఇండియాలోనే టాప్ యాక్టరా!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సలార్(Salaar). కేజీఎఫ్(KGF) తరువాత కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth neel) తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో.. సలార్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రిలీజ్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

తాజాగా రిలీజైన టీజర్ కు ఆడియన్స్ నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ టీజర్ ఏకంగా  100 మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇండియా నుండి ఈ రికార్డ్ క్రియేట్ చేసిన మొదటి టీజర్ గా సలార్ రికార్డ్ క్రియేట్ చేసింది.  ఈ ఒక్క రీజన్ చాలు ప్రేక్షకుల్లో సలార్ మూవీ క్రేజ్ ఎలా ఉందొ చెప్పడానికి.    

ALSO READ :"కాలచక్రం"లో ప్రభాస్.. సోషల్ మీడియాలో వైరలవుతున్న న్యూస్
 
ఇక తాజాగా సలార్ మూవీ నుండి మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అదేంటంటే.. ఈ సినిమా కోసం ప్రభాస్ రూ.100 కోట్ల భారీ మొత్తాన్ని రెమ్యునరేషన్ గా తీసుకున్నారట. అంతేకాదు.. సినిమా లాభాల్లో 10% అదనంగా ప్రభాస్ అందుకోబోతున్నారట. ఇవన్నీ కలుపుకొని దాదాపు రూ.150 కోట్ల వరకు వెనకేసుకొనున్నారట ప్రభాస్. దీంతో.. ఇండియా వైడ్ గా అత్యధిక పారితోషకం తీసుకుంటున్న స్టార్ హీరోగా రికార్డ్ క్రియేట్ చేశారు ప్రభాస్. ఈ న్యూస్ తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్.. ఎందులోనైనా మా ప్రభాసన్నే టాప్ అంటూ కామెంట్స్ పెడుతన్నారు.