
ఒక సినిమా పూర్తి చేశాకే మరో మూవీ సెట్స్‌కి వెళ్లే ప్రభాస్.. కెరీర్ స్టార్ట్ చేసినప్పట్నుంచీ ఎప్పుడూ ఇంత బిజీ షెడ్యూల్స్‌లో సినిమాలు చేయలేదు. ఇప్పుడు మాత్రం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, వీలైనంత ఫాస్ట్‌గా వాటిని పూర్తి చేయాలనుకుంటున్నాడు. ప్రస్తుతం ఐదు ప్యాన్ ఇండియా చిత్రాలు ఆయన చేతిలో ఉన్నాయి. వాటిలో ఇప్పటికే ‘ఆది పురుష్’ షూటింగ్ కంప్లీట్ చేసేశాడు. ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ‘సాలార్’, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కె’ స్టార్ట్ చేసి కొంత పార్ట్ షూట్ పూర్తి చేశాడు. ఇవి కాక సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ చేయాల్సి ఉంది. దీంతో పాటు మారుతి దర్శకత్వంలోనూ ప్రభాస్ ఓ మూవీ చేయనున్నాడనే టాక్ వినిపిస్తోంది. వీటన్నింటికి ఆయన డేట్స్ అడ్జస్ట్ చేయాలంటే చాలా కష్టమైన పని. ‘ప్రాజెక్ట్ కె’కి ఎక్కువ రోజులు కేటాయించాల్సి రావడంతో ముందు ‘సాలార్’ని, అలాగే మారుతి మూవీని కూడా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. దీనికోసం నెలలో ఒక పదిహేను రోజులు ‘సాలార్’కి, మరో పదిహేను రోజులు మారుతి చిత్రానికి కేటాయించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది చివరికల్లా ఈ రెండు సినిమాలను మాత్రం పూర్తి చేసేయాలని నిర్ణయించారట. ఇదే స్పీడులో కానీ కొనసాగితే వచ్చేయేడు ప్రభాస్‌వి మూడు సినిమాలు రిలీజ్ అయ్యే చాన్స్ ఉంది. షూటింగ్ విషయంలో ప్రభాస్ వేసిన ప్లాన్స్ పర్ఫెక్ట్ అంటూ ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్.