Kalki 2898 AD: టార్గెట్ హాలీవుడ్.. అంచనాలు డబుల్ చేస్తున్న కల్కి లీక్డ్ వీడియో

Kalki 2898 AD: టార్గెట్ హాలీవుడ్.. అంచనాలు డబుల్ చేస్తున్న కల్కి లీక్డ్ వీడియో

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabahs) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898 AD). క్రియేటీవ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ తెరెకెక్కుతున్న ఈ సినిమా కోసం ఇండియన్ సినీ ఇండస్ట్రీతో సహా ప్రపంచ సినిమా కూడా ఈగర్ గా ఎదురుచూస్తోంది. కారణం ఈ సినిమా కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంచుకున్న కథ. ఇండియన్ మైథాలజీలో మహా విష్ణువు ఆఖరి అవతారం కల్కి ని లింక్ చేస్తూ, సైంటిఫిక్ థ్రిల్లర్ గా రానుంది ఈ సినిమా. ఇప్పటికే విడుదలైన టీజర్ తో సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చిన్న హింట్ ఇచ్చాడు నాగ్ అశ్విన్. 

ఇక అప్పటి నుండి ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుంగా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. అందుకే ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా కల్కి సినిమా సెట్స్ నుండి లీకైన ఓ వీడియో  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కనిపిస్తున్న విజువల్స్ చూస్తుంటే ఈసారి హాలీవుడ్ ను టార్గెట్ చేయనున్నారు మేకర్స్ అని క్లియర్ గా అర్థమవుతోంది. వీడియోలో ఒక్కో విజువల్ నెక్స్ట్ లెవల్లో ఉంది. అయితే ఆ వీడియోను ఇంటర్నెట్ నుండి తొలగించాగా.. ఆ వీడియోకి సంబందించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక కల్కి 2898 AD సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో బాలీవూడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామ పాత్రలో చాలా పవర్ ఫుల్ గా కనిపించనున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ నెగిటీవ్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకొనె, దిశా పటాని హీరోయిన్స్ గా చేస్తున్నారు. వీరితో పాటు.. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, నేచురల్ స్టార్ నాని, రౌడీ హీరో విజయ్ దేవరకొండ, లేటెస్ట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా కీ రోల్స్ చేస్తున్నారు అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. మరి భారీ స్టార్ క్యాస్ట్ తో హాలీవుడ్ రేంజ్ వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.