Kalki Movie Release Date: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్ లాక్?

Kalki Movie Release Date: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్ లాక్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD). ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్(Nag Ashwin) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మిస్తున్నారు. పాన్ వరల్డ్ లెవల్లో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, విజయ్ దేవరకొండ, నాని, దుల్కర్ సల్మాన్, దీపికా పదుకొనె, దిశా పటాని వంటి స్టార్స్ నటిస్తున్నారు. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఇండియన్ మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంతకుముందెన్నడూ కనీ వినీ ఎరుగని రేంజ్ విజువల్స్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతోంది కల్కి. ఆ కారణంగానే ఈ సినిమాపై హైప్ రోజురోజుకి పెరుగుతోంది. అందుకు ఏమాత్రం తగ్గకుండా ఇటీవల విడుదలైన టీజర్ ఉంది. దాంతో.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఈగర్ గా చూస్తున్నారు ఆడియన్స్. 

ముందుగా ఈ సినిమా మే 9న థియేటర్స్ లో తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. కానీ, అనుకోకుండా దేశంలో ఎలెక్షన్స్ జరుగుతుండటంతో సినిమాను పోస్ట్ పోన్ చేశారు. ఇక అప్పటినుండి కల్కి సినిమా కొత్త రిలీజ్ డేట్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే కల్కి సినిమా రిలీజ్ గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాను జూన్ 27న రిలీజ్ చేయాలని చూస్తున్నారట. త్వరలోనే ఈ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త రిలాక్స్ అవుతున్నారు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న కల్కి సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.