ప్రభాస్ కల్కి 2898 AD మూవీలో..దుల్కర్ సల్మాన్..క్లారిటీ ఇచ్చేశాడుగా!

ప్రభాస్ కల్కి 2898 AD మూవీలో..దుల్కర్ సల్మాన్..క్లారిటీ ఇచ్చేశాడుగా!

మహానటి, సీతారామం వంటి క్లాసికల్ హిట్స్ తో తెలుగులో మంచి ఇమేజ్ను సొంతం చేసుకున్న హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan). లేటెస్ట్ గా కింగ్ అఫ్ కోత(King of Kotha) అంటూ వస్తోన్న ఈ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు దుల్కర్. ప్రభాస్(Prabhas) హీరోగా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న కల్కి 2898 AD మూవీలో బిగ్ స్టార్స్ నటిస్తున్న విషయం తెలిసేందే. 

దుల్కర్ రీసెంట్ గా కల్కి మూవీ షూటింగ్ స్పాట్ని విజిట్ చేశానని పేర్కోన్నారు. గత కొద్ది రోజులుగా ప్రభాస్ కల్కి సినిమాలో దుల్కర్ సల్మాన్ యాక్ట్  చేస్తున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటిదాకా మూవీ టీం అఫీషియల్ గా దీనిపై క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ తాజాగా దుల్కర్ సల్మానే ఈ విషయమై ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. 

ఇక వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో యాంకర్ మాట్లాడుతూ..హీరో ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కల్కి 2898AD లో మీరు ఉన్నారా? అని అడిగితే..ఇదే విషయంపై దుల్కర్ స్పందిస్తూ..కల్కి 2898 AD సెట్స్ ని జస్ట్ విజిట్ చేశానని, డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) ఆలోచన విధానం తన ఫస్ట్ మూవీ ఎవడే సుబ్రహ్మణ్యం,మహానటి నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ముందుకు వెళ్తున్నారు.

కల్కి వంటి గ్రేట్ స్క్రిప్ట్ రాయాలంటే,  నాగ్ అశ్విన్ తప్ప మరెవరికి అలాంటి ఆలోచన రాదని పేర్కోన్నారు . అలాగే మరో యాంకర్ అడుగుతూ.. మరి కల్కి లో మీకు ఎవరితోనైనా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా? అని అడిగితే.. దుల్కర్ బదులిస్తూ..దాని గురించి మాట్లాడకూడదని, ఈ మూవీలో తాను ఉన్నానో లేదో తనకు తెలియదని,మేకర్స్ మాత్రమే చెప్పగలరు అని వెల్లడించారు. దీంతో దుల్కర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి. 

ప్రభాస్,డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి 2898 AD మూవీలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌ వంటి బిగ్ స్టార్స్ యాక్ట్ చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా దుల్కర్ సల్మాన్ కల్కిలో జాయిన్ అయ్యాడు అని వార్తలు రావడంతో..ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.ఇక త్వరలో దీని గురుంచి మేకర్స్ ప్రకటించే ఛాన్స్ ఉంది.