పాస్ట్.. ప్రెజెంట్.. ఫ్యూచర్.. అంచనాలు పెంచుతున్న కల్కి లేటెస్ట్ న్యూస్

పాస్ట్.. ప్రెజెంట్.. ఫ్యూచర్.. అంచనాలు పెంచుతున్న కల్కి లేటెస్ట్ న్యూస్

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్(Prabhas) న‌టిస్తున్న లేటెస్ట్ సైన్స్ ఫిక్ష‌న్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ కల్కి 2898 AD(Kalki 2898AD). టాలీవుడ్ క్రియేటీవ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag ashwin) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ భారీగా నిర్మిస్తున్నారు. లోక‌నాయ‌కుడు కమల్‌ హాసన్‌ విల‌న్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకొనే, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీ రోల్ చేస్తున్నారు. ఈ రేంజ్ స్టార్ క్యాస్ట్ తో ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. 

తాజాగా అలాంటి న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ సీఈఓ కల్కి మూవీ సెట్స్‌లో ప్రభాస్ ను కలిసిన విషయం తెలిసిందే. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఆ ఫొటోలో ప్రభాస్ గుబురు గడ్డంతో చాలా స్టైలీష్ గా కనిపించారు. దాంతో ఆ లుక్ చాలా వైరల్ అయ్యింది. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఆ లుక్ చూసి చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు.

అయితే.. ఈ లుక్ తో ఒక న్యూస్ వైరల్ గా మారింది. అదేంటంటే.. కల్కి సినిమాలో ప్రభాస్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ కు సంబందించిన మూడు పాత్రల్లో కనిపించనున్నారట.  ఒక్కో టైం పీరియడ్స్ లో ఒక్కో గెటప్ లో కనిపించి ఆడియన్స్ ను అలరించనున్నారట ప్రభాస్. టీజర్ లో లాంగ్ హెయిర్ తో కనిపించిన ప్రభాస్.. చిరంజీవి బర్త్ డే సందర్బంగా రిలీస్ చేసిన వీడియోలో షార్ట్ హెయిర్ తో కనిపించారు. ఇక తాజాగా వైరల్ అవుతున్న ఫొటోలో గుబురు గడ్డంతో కనిపించారు. కాబట్టి ఈ సినిమాలో పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ కు సంబందించిన మూడు పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.