
కల్కి 2898 ఏడి’తో మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ కూడా ఒకటి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్. ఈ మూవీ నుంచి ‘ఫ్యాన్ ఇండియా గ్లింప్స్’ పేరుతో సోమవారం ఓ వీడియోను విడుదల చేశారు.
బైక్ దిగి నడిచొస్తూ పూల బొకేతో వింటేజ్ లుక్‌లో ఛార్మింగ్‌గా కనిపిస్తున్న ప్రభాస్.. కారు అద్దంలో తనను తాను చూసుకుంటూ పూలు చల్లుతున్న విజువల్స్ ఆకట్టుకున్నాయి. కూల్ అండ్ స్టైలిష్ లుక్‌లో ప్రభాస్ కనిపిస్తుండడతో ఖుషి అవుతున్నారు అభిమానులు. ఇప్పటికే నలభై శాతం వరకూ షూటింగ్ పూర్తయింది. ఆగస్టు 2 నుంచి మరో భారీ షెడ్యూల్ మొదలవబోతోంది. హారర్ రొమాంటిక్ కామెడీ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలియజేశారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.