యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆదిపురుష్. ప్రభాస్ రాముడిగా చేస్తున్న ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ సీతగా కనిపిస్తుండగా, ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన సాంగ్స్, పోస్టర్స్ కు ఆడియన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఇక రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.
దీంతో చిత్ర రిలీజ్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే, తాజాగా వినిపిస్తున్న న్యూస్ ఒకటి ప్రభాస్ ఫ్యాన్స్ కు తెగ ఖుషీ చేస్తోంది. అదేంటంటే, ఆదిపురుష్ సినిమా రిలీజ్ తోపాటే సలార్ సినిమా టీజర్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా అంటే సలార్ అనే చెప్పాలి. దానికి కారణమా కేజీఎఫ్ తరువాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా అవడం. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా రోజుల నుండి ఈ సినిమా టీజర్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
ఇక తాజాగా వినిపిస్తున్న న్యూస్ తో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నిజంగా ఆదిపురుష్ సినిమాతో సలార్ టీజర్ రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ కు డబల్ ట్రీట్ ఖాయం అని చెప్పాలి.