
ఒక్కోసారి సినిమా స్టోరీ అనేది బడ్జెట్‌నే కాదు.. సీక్వెల్స్‌ని కూడా డిమాండ్ చేస్తుంది. ‘రక్తచరిత్ర’ మొదలు బాహుబలి, పుష్ప వరకు జరిగిందిదే. సింగిల్ మూవీగా స్టార్ట్ చేసినా తర్వాత సెకెండ్ పార్ట్ కూడా తీయాల్సొచ్చింది. ప్రభాస్ మూవీ విషయం లోనూ ఇదే జరుగుతోంది. ‘కేజీయఫ్’ను రెండు భాగాలుగా తీసిన ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ‘సాలార్’ని కూడా టూ పార్ట్స్‌గా తీస్తున్నాడట. కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్న ఈ విషయం ఇప్పుడు కన్‌ఫర్మ్ అయి నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దీనితో పాటు ‘ప్రాజెక్ట్ కె’లోనూ నటిస్తున్నాడు ప్రభాస్. ఈ యేడు సమ్మర్‌లో ‘రాధేశ్యామ్’, ఆగస్టులో ‘ఆదిపురుష్’ రిలీజ్ కానున్నాయి. దీంతో ‘సాలార్’ ఫస్ట్ పార్ట్‌ని వచ్చే యేడు విడుదల చేయనున్నారు. శ్రుతీహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఒకప్పుడు సీక్వెల్ అంటే కోరి ఫ్లాప్‌ని కొని తెచ్చుకోవడమే అనే సెంటి మెంట్ ఉండేది. కానీ ‘బాహుబలి’తో దాన్ని బ్రేక్ చేసి దీన్నో సక్సెస్ ఫార్ములాగా మార్చిన ప్రభాస్.. ‘సాలార్’తోనూ సేమ్ మేజిక్ రిపీట్ చేసి డబుల్ ట్రీట్ ఇస్తాడేమో చూడాలి!